Sree Vishnu | రొటీన్ సినిమాలకు భిన్నంగా తనకంటూ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు. ఈ హీరో స్వాగ్(Swag) అంటూ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బోరింగ్ కథలకు టాటా చెబుతూ! సరికొత్త పంథాలో అచ్చ తెలుగు సినిమా #SWAG శ్వాగణిక వంశానికి స్వాగతం అంటూ ఈ మధ్యే గ్లింప్స్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ విడుదల తేదీని అనౌన్స్ చేసింది.
ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన స్వాగ్ టీమ్ ఈ సినిమాను జూలైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. శోభకృత్ దాటి క్రోధి నామ సంవత్సరానికి వచ్చేసిన అన్ని వంశాలకు శ్యాగణిక వంశం నుండి శుభాకాంక్షలు. మేము కూడా వస్తున్నాం. మీ అభిమాన వెండితెరల మీదకి గ్రీష్మ ఋతువు, ఆషాడ మాసం. జూలై మొదటి వారం నుంచి మగవాడి మోత అంటూ రాసుకోచ్చింది. కాగా ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహారిస్తుండగా.. ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహించబోతున్నాడు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు.
Sreevishnu – #SWAG – July Release pic.twitter.com/PBWFYdf2mv
— Aakashavaani (@TheAakashavaani) April 9, 2024