Sushmita Sen | ప్రస్తుతం నాకు నచ్చిన ప్రదేశంలో సంతోషంగా ఉన్నా.. లలిత్ మోడీతో డేటింగ్‌పై మాజీ విశ్వసుందరి ట్వీట్
మాజీ విశ్వసుందరి సుష్మితాసేన్తో ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ డేటింగ్ చేస్తున్నట్లు చెప్పిన వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. సుష్మితాసేన్తో దిగిన ఫొటోలను లలిత్ మోడీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. తామిద్దరం డేటింగ్లో ఉన్నామని క్లారిటీ ఇచ్చాడు. సుస్మితా తన బెటర్‌హాఫ్ అని చెప్పాడు. దీంతో అయోమయానికి లోనైన నెటిజన్లు ఆల్రెడీ వీళ్లు పెళ్లి చేసుకున్నారనుకుని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, లలిత్ మోడీతో డేటింగ్‌పై సుష్మితా సేన్ శుక్రవారం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తనకు నచ్చిన ప్రదేశంలో తాను సంతోషంగా ఉన్నానని ఫొటోను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది.

‘ప్రస్తుతం నేను నాకు నచ్చిన ప్రదేశంలో సంతోషంగా ఉన్నా. ఇంకా రింగ్స్ మార్చుకోలేదు, పెళ్లి చేసుకోలేదు. కేవలం ప్రేమలో మునిగి తేలుతున్నా.. ఈ క్లారిఫికేషన్ సరిపోతుందనుకుంటా.. ఇక నా పని నేను చూసుకుంటా.. నా సంతోషాన్ని పంచుకునేవారికి థ్యాంక్యూ.. ఎవరైతే పంచుకోరో.. వారికి నా గురించి అవసరం లేదు.. ఏదేమైనా లవ్ యూ గయ్స్..’ అని ఇన్‌స్టాలో ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది సుష్మితాసేన్. ఈ పోస్ట్‌తో లలిత్ మోడీని సుష్మితాసేన్ పెళ్లి చేసుకున్నారనుకున్న ఫ్యాన్స్‌కు ఓ క్లారిటీ ఇచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం