Suriya41 | బాలా సినిమా నుండి తప్పుకున్న సూర్య.. కారణం ఎంటంటే?
కోలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో 'వణంగాన్' ఒకటి. 'నందా', 'శివపుత్రుడు' సినిమాల తర్వాత ఈ కాంబోలో సినిమా తెరకెక్కనుండటంతో ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నియి. అయితే తాజాగా ఈ సినిమా నుండి సూర్య తప్పుకున్నట్లు బాల వెల్లడించాడు.
Achaludu Movie Shelved | రియలిస్టిక్‌గా, నాచ్యురాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలను తెరకెక్కించే దర్శకుడు బాలా. విలక్షణ మైన నటనతో విమర్శకులను సైతం ఔరా అనిపించే నటుడు సూర్య. వీళ్ళిద్దరి కాంబోలో తెరకెక్కిన ‘నందా’, ‘శివపుత్రుడు’ కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి గొప్ప ప్రశంసలు అందుకున్నాయి. ఈ రెండు చిత్రాలు ఈ ఇద్దరికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. మళ్ళీ 18ఏళ్ళ తర్వాత వీరిద్దరూ కలిసి ‘అచలుడు’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. 40శాతం షూటింగ్ కూడా పూర్తయింది. కాగా తాజాగా ఈ సినిమా నుండి సూర్య తప్పుకున్నట్లు దర్శకుడు బాలా ప్రకటించాడు.
ఇలా అర్ధాంతరంగా సూర్య ఈ సినిమా నుండి తప్పుకోవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.ఈ క్రమంలో బాలా సోషల్ మీడియాలో ఓ లేఖను పోస్ట్ చేశాడు. ఆ లేఖలో దర్శకుడు బాలా.. అచలుడు కథలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందని, దాంతో ఈ సినిమా కథ సూర్యకు సరిపోదని అనిపించినట్లు బాలా తెలిపాడు. పరస్పర అంగీకారంతోనే సూర్య ఈ సినిమా నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. సూర్యకు కూడా ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు బాలా లెటర్లో తెలిపాడు. అయితే సూర్య తప్పుకున్నా ఈ సినిమా మాత్రం కొనసాగుతుందని అన్నాడు.
ఇక బాల గతంలో కూడా అజిత్‌తో సినిమా మొదలు పెట్టి, మధ్యలోనే ఆ ప్రాజెక్ట్‌ను కాన్సిల్ చేశాడు. ఇక అర్జున్ రెడ్డి రీమేక్‌ను కూడా ముందుగా ధృవ్ విక్రమ్‌తో తెరకెక్కించాడు. షూటింగ్ కూడా పూర్తయింది. కానీ అవుట్ పుట్ సరిగ్గాలేదని సినిమాను కాన్సిల్ చేశారు. ఆ తర్వాత గిరీశయ్య ఆదిత్య వర్మ పేరుతో రీమేక్ చేశాడు. ఇక ఇప్పుడు సూర్యతో కూడా సినిమా కాన్సిల్ అవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఈ సినిమాను సూర్య స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా కూడా తప్పుకున్నట్లు సమాచారం. సూర్యకు జోడీగా కృతి ఎంపికైంది. ఈ సినిమాతోనే ఆమె తమిళంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇక ఇప్పుడు ప్రాజెక్ట్ కాన్సిల్ అవడంతో కృతి తీవ్రంగా నిరాశపడిందట.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

