సూర్య 46 మొదలైంది
గత రెండు చిత్రాల ఫలితాలు నిరుత్సాహపరచడంతో అగ్ర నటుడు సూర్య ఇప్పుడు మంచి హిట్ కోసం నిరీక్షిస్తున్నారు. అభిమానులు కూడా ఆయన స్ట్రాంగ్ కమ్బ్యామ్ ఇస్తారని ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సూర్య46వ చిత్రం బుధవారం సెట్స్‌మీదకు వెళ్లింది.
గత రెండు చిత్రాల ఫలితాలు నిరుత్సాహపరచడంతో అగ్ర నటుడు సూర్య ఇప్పుడు మంచి హిట్ కోసం నిరీక్షిస్తున్నారు. అభిమానులు కూడా ఆయన స్ట్రాంగ్ కమ్బ్యామ్ ఇస్తారని ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సూర్య46వ చిత్రం బుధవారం సెట్స్‌మీదకు వెళ్లింది. ‘లక్కీ భాస్కర్’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన సందర్భంగా చిత్రబృందం కొత్త పోస్టర్‌ను సోషల్‌మీడియా ద్వారా పంచుకుంది. ‘వేడుక, భావోద్వేగం మరియు వినోదం వైపు తొలి అడుగు’ అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్‌ను జత చేసింది. ‘లక్కీ భాస్కర్’ తరహాలోనే బలమైన భావోద్వేగాలు, హ్యూమన్ డ్రామా కలబోసిన కథాంశమిదని, వైవిధ్యానికి చిరునామాగా అభివర్ణించే సూర్య కెరీర్లో మరో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందని మేకర్స్ తెలిపారు.
ఇందులో మమితాబైజు నాయికగా నటిస్తుండగా, రాధికా శతర్కుమార్ కీలక పాత్రను పోషిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చిత్రానికి కెమెరా: నిమిష్ రవి, సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, ఎడిటింగ్: నవీన్నూలి, ఆర్ట్: బంగ్లాన్, నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య, రచన-దర్శకత్వం: వెంకీ అట్లూరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- suriya
- Suriya 46
- Venky Atluri
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

