Suriya 43 | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కంగువ సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందే సూర్య43 అప్డేట్స్ నెట్టింట హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఆకాశం నీ హద్దురా ఫేం డైరెక్టర్ సుధాకొంగర (Sudha Kongara)తో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు సూర్య. కాగా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. సూర్య 43 (Suriya 43) అనౌన్స్మెంట్ వీడియోను షేర్ చేశాడు సూర్య.
సుధా కొంగరతో మళ్లీ కలిసి పనిచేస్తుండటం ఎక్జయిటింగ్‌గా ఉంది. జీవీ ప్రకాశ్ కుమార్ 100వ ప్రాజెక్ట్. సోదరుడు దుల్కర్ సల్మాన్, టాలెంటెడ్ యాక్టర్లు విజయ్ వర్మ, నజ్రియాతో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నా. హోంబ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్లో స్పెషల్ సినిమాను నిర్మిస్తుండటం సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు సూర్య. ఖాళీ సీసా, టేప్ రికార్డర్, మైక్, మంటలు, పిస్తోల్.. ఇలా డిఫరెంట్ ప్రాపర్టీస్‌ను అనౌన్స్మెంట్ వీడియోలో చూడొచ్చు.
ఈ చిత్రానికి Purananooru టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. తాజా వీడియో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. ఇది బయోపిక్ కాదని, ఈ చిత్రం కూడా నిజ జీవితంలో జరిగిన వాస్తవ ఘటనల స్పూర్తితో సూరారై పోట్రును మించి, భారీ స్థాయిలో ఉండబోతుందని చిట్‌చాట్‌లో తెలియజేశారు సుధా కొంగర.
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కంగువలో బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే మేకర్స్ కంగువ నుంచి విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కంగువ ప్రపంచవ్యాప్తంగా 2డీ, 3డీ ఫార్మాట్లలో 10 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
సూర్య 43 అనౌన్స్మెంట్ వీడియో..
Dear all we are excited! Joining hands with @Sudha_Kongara again in a @gvprakash musical, his 100th! SO looking forward to work with my brother @dulQuer & the talented #Nazriya & the performance champ @MrVijayVarma Glad @2D_ENTPVTLTD is producing this special film! #Jyotika… pic.twitter.com/wW9iu0jMeR
— Suriya Sivakumar (@Suriya_offl) October 26, 2023
BREAKING: Nadippin Nayagan #Suriya‘s 43rd announcement video.pic.twitter.com/mPCC5NYUcf#Purananooru|#Suriya43 will be directed by Soorarai Pottru director Sudha Kongara.
GV Prakash… pic.twitter.com/DIMLqdjrMA
— Manobala Vijayabalan (@ManobalaV) October 26, 2023
• “ It’s Very Big, The Scale Is Very Big, & It’s A True Story. It’s Not A Biopic, But Inspired By Real Life Incidents! It’s very challenging than Sooraraipottru
– @Sudha_Kongara About #Suriya43 ! 💥
Kollywood’s biggest Sambavam loading 🔥
Tomorrow ⏳@Suriya_Offl #Kanguva pic.twitter.com/ivf8j6FZGL
— ஆத்ரேயாடா ™ 🔥 ˢᵘʳⁱʸᵃ ᵐᵃᶠⁱᵃ (@_Athreyada_offl) October 25, 2023
24 HOURS TO GO. #Suriya43 🔥 pic.twitter.com/btQLVXVDqp
— Suriya Fans Club (@SuriyaFansClub) October 25, 2023