Surender Reddy | ఇద్దరు స్టార్ హీరోలను ఆప్షన్‌గా పెట్టుకున్న సురేందర్ రెడ్డి.. ఎవరు చాన్స్ ఇస్తే వారితోనే సినిమా అట..!
Surender Reddy | ఏజెంట్ సినిమా సురేందర్ రెడ్డిని పాతాళానికి పడేసింది. ఎంతలా ఉంటే సినిమా వచ్చి నెలలు దాటుతున్నా.. ఇంకా తదుపరి సినిమాపై ఎలాంటి క్లారిటీ లేదు. మరో వైపు అఖిల్ పరిస్థితి కూడా అంతే ఉంది. ఇక డైరెక్టర్ సురేందర్ రెడ్డి వీలైనంత త్వరగా నెక్స్ట్ సినిమాను ప్రకటించేస్తే బెటర్.
Surender Reddy | ఏజెంట్ సినిమా సురేందర్ రెడ్డిని పాతాళానికి పడేసింది. ఎంతలా ఉంటే సినిమా వచ్చి నెలలు దాటుతున్నా.. ఇంకా తదుపరి సినిమాపై ఎలాంటి క్లారిటీ లేదు. మరో వైపు అఖిల్ పరిస్థితి కూడా అంతే ఉంది. ఇక డైరెక్టర్ సురేందర్ రెడ్డి వీలైనంత త్వరగా నెక్స్ట్ సినిమాను ప్రకటించేస్తే బెటర్. ఏజెంట్ రిలీజ్ అయ్యే ముందు వరకు సురేందర్ రెడ్డి సినిమాలకు ఒక క్రేజ్ ఉండేది. స్టైలిష్ యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో ఆయనకు సాటి ఎవరూ లేరనేది ఇండస్ట్రీ పెద్దలే తీర్మానించారు. ఆయన ఫ్లాప్ సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టిన సందర్భాలున్నాయి. అలాంటిది ఒక్క ఏజెంట్ సినిమాతో ఇన్నాళ్లు సంపాదించుకున్న పేరు ఒక్కసారిగా కనుమరుగైపోయింది.
ప్రస్తుతం ఈ దర్శకుడు అర్జెంటుగా ఓ సినిమాను పట్టాలెక్కించాలి. కాగా ఏజెంట్ కొట్టిన దెబ్బకి ఇప్పుడున్న స్టార్ హీరోలెవ్వరు చాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. దాంతో సురేందర్ రెడ్డి సీనియర్ హీరోతో చర్చలు జరుపుతున్నారు. ఇంతకీ ఆ సీనియర్ హీరో ఎవరా అనుకుంటున్నారా? అతనే వెంకటేష్. ఈ కాంబోలో సినిమాపై ఎప్పటి నుంచో వస్తున్న వార్తలే అయిన.. ఇప్పుడు పక్కాగా ఈ కాంబో సెట్స్ మీదకు వెళ్తుందని ఇన్సైడ్ టాక్. అయితే ప్రస్తుతం వెంకటేష్ సైంధవ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు హిట్ సిరీస్ సైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.
మరోవైపు చియాన్ విక్రమ్‌కు కూడా సురేందర్ రెడ్డి ఓ కథను వినిపించాడట. ఇక విక్రమ్‌కు కూడా కథ బాగా నచ్చిందట. అయితే ప్రస్తుతం విక్రమ్ చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో తంగళాన్ షూటింగ్ పూర్తి చేసుకోగా.. రీసెంట్గా కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రస్తుతం అటు వెంకటేష్, ఇటు విక్రమ్ కాల్ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరిలో ఎవరు ఎస్ అంటే వారితో సినిమాను మొదలు పెట్టబోతున్నాడట. అంతేకాకుండా వీరిద్దరి చెప్పినవి రెండు వేర్వేరు కథలని తెలుస్తుంది. మరి సురేందర్ రెడ్డికి చాన్స్ ఇచ్చే హీరో ఎవరా అన్నది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

