కొత్తగా ఉండటం వల్లే…
సంపత్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘సురాపానం’. ప్రగ్యా నయన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై మట్ట మధు యాదవ్ నిర్మించారు. ఫాంటసీ థ్రిల్లర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెకిన ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రానికి మంచి స్పందన వస్తున్నదంటూ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్ లో నిర్వహించారు చిత్ర బృందం. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ…‘పెద్ద సినిమాల మధ్య ధైర్యం చేసి మా చిత్రాన్ని విడుదల చేశాం. కంటెంట్ మీదే నమ్మకం పెట్టుకున్నాం. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు మా సినిమాను ఇష్టపడుతున్నారు. ఈ వారం నుంచి థియేటర్లను కూడా పెంచుతున్నాం’ అన్నారు. ‘తెలుగు తెరకు కొత్త అమ్మాయిని అయినా టీమ్ అంతా సహకరించారు. సినిమా కోసం మేము పడిన కష్టమే ఈ విజయాన్ని అందించింది అనుకుంటున్నాను. మాకు విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్’ అని హీరోయిన్ ప్రగ్యా నయన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ జేబీ, నటులు మీసాల లక్ష్మణ్, గిరి పోతురాజ్, విద్యాసాగర్, అంజిబాబు ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

