Koratala Siva | దర్శకుడు కొరటాల శివకు చుక్కెదురు..! క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనన్న సుప్రీంకోర్టు..!
Koratala Siva | టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కొరటాల శివ క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నాంపల్లి కోర్టు ఉత్తర్వుల ప్రకారం కేసును ఎదుర్కోవాల్సిందేనని చెప్పింది.
Koratala Siva | టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కొరటాల శివ క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నాంపల్లి కోర్టు ఉత్తర్వుల ప్రకారం కేసును ఎదుర్కోవాల్సిందేనని చెప్పింది. దర్శకుడు కొరటాల శివన తన కథను కాపీ చేసి సినిమా తీశారని రచయిత శరత్ చంద్ర కోర్టుకెక్కారు. స్వాతి మ్యాగజైన్లో వచ్చిన తన కథ ‘శ్రీమంతుడు’ సినిమాగా తీశారంటూ శరత్ చంద్ర నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ మేరకు విచారించిన కోర్టు దర్శకుడిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. నాంపల్లి కోర్టు ఉత్తర్వులపై కొరటాల శివ హైకోర్టును ఆశ్రయించారు. తన కథను కాపీ కొట్టారని ఆరోపించిన రచయిత.. ఈ మేరకు కోర్టుకు ఆధారాలను సమర్పించారు. చిత్ర నిర్మాత ఎర్నేని రవి, ఎంబీ ఎంటర్టైన్మెంట్లపై కాపీ రైట్యాక్ట్ కేసు నమోదు చేయాలని, ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదు చేయాలన్న కథ రచయిత శరత్ చంద్ర అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.
శరత్ చంద్ర సమర్పించిన ఆధారాలను సైతం రచయితల సంఘం నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చింది. రచయితల సంఘం నివేదికను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. నాంపల్లి కోర్టు ఉత్తర్వులనే సమర్థిస్తూ హైకోర్టు తీర్పును సమర్థించింది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో దర్శకుడు సవాల్ చేశారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా.. ఇంకా ఈ కేసులో విచారణ జరపడానికి ఏం లేదని స్పష్టం స్పష్టం చేసింది. పిటిషన్ను వెనక్కి తీసుకోకపోతే డిస్మిస్ చేస్తామని చెప్పింది. దీంతో కొరటాల శివ తరఫున న్యాయవాది పిటిషన్ను ఉపసంహరించుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

