ఓ ఉపాధ్యాయుడి కథ ‘సూపర్ సుబ్బు’
సందీప్‌కిషన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న కామెడీ వెబ్‌సిరీస్ ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సిరీస్ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో సందీప్‌కిషన్ సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు అనే ఉపాధ్యాయుడి పాత్రలో కనిపించనున్నారు.
సందీప్‌కిషన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న కామెడీ వెబ్‌సిరీస్ ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సిరీస్ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో సందీప్‌కిషన్ సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు అనే ఉపాధ్యాయుడి పాత్రలో కనిపించనున్నారు. మాకిపూర్ అనే గ్రామానికి టీచర్‌గా వెళ్లిన అతనికి అక్కడ ఎదురైన పరిస్థితులు, జీవితాన్ని మార్చే సంఘటనల నేపథ్యంలో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
ఈ సిరీస్‌లో సాధారణ ప్రజలు మాట్లాడటానికి సంకోచించే ఓ సీరియస్ అంశాన్ని హాస్యం, భావోద్వేగాలు మేళవించి చెప్పే ప్రయత్నం చేశామని, సమస్యను పరిష్కరించాలనుకొని తానే ఇబ్బందుల్లో చిక్కుకునే ఉపాధ్యాయుడిగా తన పాత్ర ఆద్యంతం వినోదభరితంగా సాగుతుందని సందీప్‌కిషన్ తెలిపారు. హాస్యంతో పాటు మానవ సంబంధాల ఆవశ్యకతను చర్చించే సినిమా ఇదని కథానాయిక మిథిలా పాల్కర్ పేర్కొన్నది. ఈ సిరీస్‌లో బ్రహ్మానందం, గెటప్ శ్రీను, మానస చౌదరి తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. మల్లిక్‌రామ్ దర్శకత్వం వహించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape | తుపాకీతో బెదిరించి.. చెల్లెలి కళ్ల ముందే అక్కపై గ్యాంగ్ రేప్.. దీపావళి రాత్రి దారుణం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డుల వేట.. ఆరో రోజు కూడా తగ్గని జోరు, ఒక్కరోజే 1.25 మిలియన్ టికెట్లు!
Samantha | తొలి వ్యాపారంలోనే భారీ నష్టాలు.. అయినా వెనక్కి తగ్గని సమంత, ఇప్పుడు 10 స్టార్టప్స్‌లో పెట్టుబడులు!
DSPs Transfers | డీఎస్పీల బదిలీలకు రంగం సిద్ధం.. జిల్లాలు, కమిషనరేట్లలో ఖాళీలపై ఉన్నతాధికారుల ఆరా
కాంగ్రెస్ పాలనలో కరోనా కంటే దారుణం.. రెండేళ్లలో భారీగా పడిపోయిన పెట్టుబడులు.. టీజీఐపాస్ గణాంకాల్లో నిగ్గుతేలిన నిజాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

