సన్నీ లియోన్‌కు డైమండ్ నెక్లెస్ బహుమతి

బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. బిగ్ బాస్ షోతో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సన్నీ ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. ముఖ్యంగా ఐటెం సాంగ్స్‌తో మంచి గుర్తింపు దక్కించుకుంది. హిందీలోనే కాక తెలుగు, తమిళ భాషలలోను నటించి అలరించింది సన్నీ లియోన్. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సన్నీ లియోన్ తరచు తన ఫ్యామిలీ విషయాలతో పాటు ఇంట్రెస్టింగ్ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్స్‌ను అలరిస్తూ ఉంటుంది.
సన్నీ లియోన్ పదేళ్ల క్రితం డేనియల్ వెబర్‌ను వివాహం చేసుకుంది. తాజాగా వీరిద్దరి వివాహ జరిగి పదేళ్లు కావడంతో శ్రీమతికి వజ్రాల నెక్లెస్ బహుమతిగా ఇచ్చాడు డానియల్. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది సన్నీ. భర్త ఇచ్చిన డైమండ్ నెక్లెస్ ధరించిన సన్నీ లియోన్.. వజ్రాల నెక్లెసస్ బహుమతిగా ఇచ్చినందుకు ధన్యవాదాలు. పదమూడేళ్ల అనుబంధంలో పదేళ్ల వివాహ జీవితం మనది. చేసుకున్న ప్రామిస్ వలన మనోహరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాం. చాలా సంతోషంగా ఉందంటూ సన్నీ స్ఫష్టం చేసింది. వీరు 2017లో నిషా అనే చిన్నారిని దత్తత తీసుకోగా, ఆ తర్వాత సరోగసి ద్వారా జన్మించిన ఇద్దరు మగబిడ్డలకు తల్లిదండ్రులయ్యారు. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ మలయాళంలో ‘షీరో’ చిత్రంతో పాటు ఓ టీవీ షో చేస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

