ముంబై : బాక్సాఫీస్ వద్ద గదర్ 2 (Gadar 2) వసూళ్ల సునామీ కొనసాగుతోంది. సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా తెరకెక్కిన గదర్ 2 విశేష ప్రేక్షకాదరణతో రూ. 400 కోట్ల మార్క్ దిశగా పరుగులు పెడుతోంది. ఈ మూవీ రెండో వారాంతంలో ఏకంగా రూ. 90.47 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డు సాధించింది.
గదర్ 2 సెకండ్ వీకెండ్లో హిందీ బెల్ట్‌లో హైయస్ట్ గ్రాసర్‌గా నిలిచి పఠాన్ (రూ. 63 కోట్లు) బాహుబలి 2 (80.75 కోట్లు) కేజీఎఫ్ (రూ. 52.49 కోట్లు) దంగల్ (రూ. 73 కోట్లు) సంజు (62.97 కోట్లు) మూవీ రికార్డులను చెరిపేసింది. ఇక 2023లో హైయస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పఠాన్ మూవీ రికార్డును గదర్ 2 బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది.
మొత్తానికి సెకండ్ వీకెండ్లో టాప్ 1 అత్యధిక గ్రాసర్‌గా రికార్డు వసూళ్లతో గదర్ 2 చరిత్ర సృష్టించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసిందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. మిశ్రమ రివ్యూల నడుమ గదర్ 2 వసూళ్ల ప్రభంజనం కొనసాగడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ముందుముందు గదర్ 2 ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Read More :