Ravi Teja | విమానంలో రవితేజ.. ఇంతకీ ఎక్కడికెళ్తున్నాడో తెలుసా..?
Ravi Teja | రవితేజ (Ravi Teja) కొన్ని రోజులుగా టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) అప్డేట్స్ ఇస్తూ.. అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. ఇటీవలే విడుదల చేసిన టైగర్ నాగేశ్వరరావు టీజర్‌తో అందరి అటెన్షన్‌ను తనవైపునకు తిప్పుకున్నాడు. తాజాగా రవితేజ విమానంలో ఉన్న స్టిల్ ఒకటి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
Ravi Teja | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోల్లో ఒకడు రవితేజ (Ravi Teja). ఈ టాలీవుడ్ మాస్ మహారాజా నటిస్తోన్న చిత్రాల్లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao)తోపాటు ఈగల్ (Eagle) సినిమాలున్నాయి. కొన్ని రోజులుగా టైగర్ నాగేశ్వరరావు అప్డేట్స్ ఇస్తూ.. అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. ఇటీవలే విడుదల చేసిన టైగర్ నాగేశ్వరరావు టీజర్‌తో అందరి అటెన్షన్‌ను తనవైపునకు తిప్పుకున్నాడు. మాస్ మూవీ లవర్స్, ఫ్యాన్స్ తన నుంచి కోరుకునే అన్ని ఎలిమెంట్స్‌ను ఈ చిత్రంతో అందించబోతున్నట్టు టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశాడు.
తాజాగా రవితేజ విమానంలో ఉన్న స్టిల్ ఒకటి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ రవితేజ ఎక్కడికెళ్తున్నాడనే కదా మీ డౌటు. రవితేజ తన ఫోకస్ అంతా స్పై థ్రిల్లర్ ఈగల్‌పై పెట్టాడని తాజా సమాచారం. విమానంలోని బిజినెస్ క్లాస్‌లో దిగిన ఫొటోను ఇన్ స్ట్రాగ్రామ్లో షేర్ చేస్తూ.. లండన్‌కు పయనం.. అంటూ ఈగల్ ఎమోజీని క్యాప్షన్‌గా పెట్టాడు. ఈగల్ నెక్ట్స్ షెడ్యూల్ లండన్‌లో జరుగనున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు. ఈ షెడ్యూల్‌తో రానున్న రెండు వారాలపాటు ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.
ఈగల్చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో అనుపమపరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కావ్య థాపర్ మరో కీలక పాత్రలో నటిస్తోండగా.. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
1970స్ కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ నేపథ్యంలో వస్తోన్న టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ వంశీ (Vamsee) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిని టైగర్ నాగేశ్వర రావు ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి కీలక పాత్రలు పోషిస్తున్న బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
తెలుగు, హిందీతోపాటు పలు భాషల్లో విడుదల చేసిన పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. గాయత్రి భరద్వాజ్ సెకండ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఈగల్ టైటిల్ అనౌన్స్ మెంట్..
టైగర్ నాగేశ్వరరావు టీజర్..
అనుపమ్ ఖేర్ న్యూ లుక్..
You have been our lucky charm sir!
Thank you for being a special part in #TheKashmirFiles and #Karthikeya2 ❤#TigerNageswaraRao will be another special film in our collaboration. https://t.co/4o7qzQW944
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 14, 2023
Introducing the versatile #MuraliSharma as ‘Viswanath Sastry’ from #TigerNageswaraRao ❤️🔥
GET READY FOR TIGER’S INVASION ON AUGUST 17th 🐅@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AnupamPKher #RenuDesai @NupurSanon @gaya3bh @Jisshusengupta @gvprakash @madhie1 @artkolla… pic.twitter.com/jt62TSDGID
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 15, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

