Sundeep kishan Micheal FirstLook | హిట్లు ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా ఏడాదికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు సందీప్ కిషన్. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గతకొంత కాలంగా ఫ్లాప్‌లతో సతమతవుతున్న సందీప్‌కు ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ కాస్త ఊరటనిచ్చింది. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఈ చిత్రంతో సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం ఈయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నాడు. సందీప్ కిషన్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ పోస్టర్లో సందీప్ సిక్స్ ప్యాక్ బాడీతో చేతిలో గన్ పట్టుకుని విలన్స్‌పై దాడి చేస్తున్నట్లు ఉంది. అంతేకాకుండా పోస్టర్లో ‘గాడ్ ఓన్లీ ఫర్ గీవ్స్’ అంటూ కాప్షన్ పెట్టడం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకులలో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక తమిళ స్టార్ విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ మీనన్‌లు ఈ చిత్రంలో నటించనుడంటంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పి,కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్లపై పుస్కుర్ రామ్మోహన్ రావు, భరత్ చౌదరీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దివ్యాంక కౌశిక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, వరుణ్ సందేష్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇక సందీప్ కిషన్ దీనితో పాటుగా మరో రెండు చిత్రాలను లైన్లో పెట్టాడు.
Happy to share the Fiery 1st Look of my Dear most director @jeranjit ‘s #Michael 👊🏽@Dir_Lokesh presents 🌟#HBDSundeepKishan ❤️@sundeepkishan @menongautham @varusarath5 @itsdivyanshak @SVCLLP @KaranCoffl @SamCSmusic @adityamusic @sivacherry9 @proyuvraaj pic.twitter.com/N6qZc498Jz
— VijaySethupathi (@VijaySethuOffl) May 7, 2022