థియేటర్లలో నవ్వులు గట్టిగా వినిపిస్తాయ్..
‘ ‘మజాకా’ సినిమా రెండు గంటలపాటు లాఫ్ రైడ్‌గా ఉంటుంది. థియేటర్లలో నవ్వులు చాలా గట్టిగా వినిపిస్తాయి. నా కెరీర్లోనే ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలుస్తుంది.
‘ ‘మజాకా’ సినిమా రెండు గంటలపాటు లాఫ్ రైడ్‌గా ఉంటుంది. థియేటర్లలో నవ్వులు చాలా గట్టిగా వినిపిస్తాయి. నా కెరీర్లోనే ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలుస్తుంది.’ అని హీరో సందీప్ కిషన్ నమ్మకం వ్యక్తం చేశారు. ఆయనా, రీతువర్మ జంటగా నటించిన చిత్రం ‘మజాకా’. నక్కిన త్రినాథరావు దర్శకుడు. రాజేష్ దండా నిర్మాత. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సందీప్ కిషన్ మాట్లాడారు.
ఈ సినిమాకోసం ప్రాణం పెట్టి పనిచేశామని, రావురమేష్ పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని సందీప్ కిషన్ తెలిపారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ ‘ఓ ఇంట్లో ఇద్దరే మగాళ్లుంటారు. ఎప్పటికైనా ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫొటో రావాలని వారు తపిస్తుంటారు. ఆ తపనే మా ‘మజాకా’ సినిమా. శివరాత్రి రోజు డబుల్ మ్యాజిక్ చేసే సినిమా ఇది.’ అని చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఓ తండ్రీకొడుకులు.. ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడితే?.. అనే కాన్సెప్ట్‌తో ఈ ట్రైలర్ ఆద్యతం కామెడీగా సాగింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

