నయనతార నాకు స్ఫూర్తి

‘నటనపరంగా నయనతార నాకు స్ఫూర్తి. ఆమెలా అభినయానికి ఆస్కారమున్న విలక్షణ పాత్రల్లో నటించాలనే కోరిక ఉంది. ఈ సినిమా ద్వారా ఆ కల కొంత నెరవేరింది’ అని చెప్పింది పూర్ణ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సుందరి’. రిజ్వాన్ నిర్మాత. కల్యాణ్ జీ గోగన దర్శకుడు. ఈ నెల 13న ఈ చిత్రం విడుదలకానుంది. ఆదివారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘అమాయకురాలైన సుందరి అనే పల్లెటూరి యువతి కథ ఇది. ఎదుటివారితో మాట్లాడటానికే భయపడే ఆమె సమాజాన్ని ఎదురించి పోరాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందన్నది ఈ చిత్ర ఇతివృత్తం. సంభాషణల కంటే హావభావాలతోనే పూర్ణ చక్కటి నటనను కనబరిచింది’ అని తెలిపారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదలచేస్తున్నామని నిర్మాత అన్నారు. పెద్ద హీరోయిన్స్ చేసే పాత్రను తనపై నమ్మకంతో దర్శకనిర్మాతలు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని పూర్ణ చెప్పింది. ఈ కార్యక్రమంలో రాకేందుమౌళి, సురేష్ బొబ్బిలి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

