Shilpa Shetty | మరో వివాదంలో బాలీవుడ్ నటి.. సమన్లు జారీ చేసిన కోర్టు
Shilpa Shetty | బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే భర్త రాజ్‌కుంద్రా అశ్లీల వీడియో కేసుతో మోసం కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. తాజాగా రుణం తిరిగి
ముంబై : బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే భర్త రాజ్‌కుంద్రా అశ్లీల వీడియో కేసుతో మోసం కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. తాజాగా రుణం తిరిగి చెల్లిందలేదన్న ఆరోపణలపై ముంబైలోని అంధేరీ కోర్టు శిల్పాశెట్టికి సమన్లు జారీ చేసింది. ఈ విషయమై ఈ నెల 28న హాజరు కావాలని శిల్పాశెట్టితో పాటు ఆమె సోదరి షమితాశెట్టి, తల్లి సునందశెట్టిని కోర్టు ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళితే.. శిల్పాశెట్టి తండ్రి సురేంద్ర శెట్టి ఓ ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని నుంచి 2015లో రూ.21 లక్షల రుణం తీసుకున్నారు.
రుణం తిరిగి 2017 జనవరి నాటికి చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నారు. అయితే, సురేంద్ర శెట్టి 2016, అక్టోబర్ 11న మృతి చెందారు. ఈ విషయం శిల్పాశెట్టితో పాటు ఆమె తల్లికి తెలుసని, అయినా డబ్బు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించారని ముంబైకి చెందిన వ్యాపారవేత్త పర్హద్ అమ్రా ఆరోపించారు. ఈ మేరకు గత శుక్రవారం జుహూ పోలీస్ స్టేషన్లో శిల్పా కుటుంబంపై ఫిర్యాదు చేయగా.. శిల్పాశెట్టితో పాటు ఆమె సోదరి షమితాశెట్టి, తల్లిపై కేసు నమోదు చేశారు. దీంతో ఈ నెల 28న కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

