వినోదం, భావోద్వేగాలతో ఆకట్టుకుంటాం
అభిరుచిగల నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మించిన పిల్లల సినిమా ‘సమ్మర్ హాలిడేస్'. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషి కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్రీకర్ దర్శకుడు. శుక్రవారం(నేడు) సినిమా విడుదల కానున్నది.
అభిరుచిగల నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మించిన పిల్లల సినిమా ‘సమ్మర్ హాలిడేస్’. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషి కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్రీకర్ దర్శకుడు. శుక్రవారం(నేడు) సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఇందులో ప్రధానపాత్రధారులైన మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్ విలేకరులతో మాట్లాడారు. అరుణ్ మాట్లాడుతూ ‘ఇందులో ఆర్వీ అనే పాత్ర పోషించాను. తనకు లైఫ్‌లో ఏ సమస్యా ఉండదు. అలాగే, సంతోషం కూడా ఉండదు.
కామ్‌గా ఉంటాడు. అలాంటి ఆర్వీకి కేవీతో పరిచయం అవుతుంది. అప్పడు అతనిలో ఎలాంటి మార్పులొస్తాయి అనేది తెరపైనే చూడాలి. జయసుధగారితో నటించడం గౌరవంగా భావిస్తున్నా. ‘35 చిన్న కథకాదు’ సినిమాకు స్టేట్, నేషనల్ అవార్డులు అందుకున్నా. దీనికి కారణం మా అమ్మే. తనకు ఆరోగ్యం బాగాలేకపోయినా నాకు తోడుండి నడిపిస్తుంది. అందుకే అమ్మకు థ్యాంక్స్’ అన్నాడు. ‘ఈ సినిమాలో చదువుపై శ్రద్ధలేని పాత్ర నాది. చాలా ఫన్‌గా ఉంటుంది. ఇందులో గోదావరి స్లాంగ్‌లో మాట్లాడటం ఓ కొత్త అనుభవం. కామెడీతోపాటు ఎమోషన్స్ సీన్స్‌లో కూడా నటించాను. నా బలం కూడా మా అమ్మే. షూటింగ్ టైమ్‌లో నాతోనే ఉండి సపోర్ట్ చేస్తుంది. డైరెక్టర్ శ్రీకర్ మనుసుపెట్టి సినిమా చేశారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన ధీరజ్ మొగిలినేనిసార్కి థ్యాంక్స్’ అని మాస్టర్ రోహన్ చెప్పాడు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

