Suma | తెలుగు బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాల సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తన కుటుంబ సభ్యులతో గడిపే క్షణాలు, ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాలను తరచూ షేర్ చేస్తుంటారు. ఇటీవల సుమ షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమె తన తాతయ్యను పరిచయం చేస్తూ ఆయన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సుమ తాతయ్య వయసు వందేళ్లు అయినప్పటికీ ఇప్పటికీ యాక్టివ్‌గా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
సుమ చెప్పిన వివరాల ప్రకారం, ఆమె తాతయ్య కేరళలో లాయర్‌గా, జడ్జ్‌గా సేవలందించారు. విశేషం ఏమిటంటే… వందేళ్ల వయసులో కూడా ఆయన తన సొంత ఆఫీస్‌కు వెళ్లి కేసులు చూసుకుంటూ లా ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సుమ షేర్ చేసిన వీడియోలో ఆమె తాతయ్య ఎంతో చురుకుగా మాట్లాడటం, చుట్టూ ఉన్న వారితో ఆత్మీయంగా మెలగడం కనిపిస్తోంది. వయసు పెరిగినా ఆయనలో ఉన్న ఉత్సాహం, స్పూర్తి అందరినీ ఆకట్టుకుంటోంది. “వయసు శరీరానికే కానీ మనసుకు కాదు” అనే భావనను ఆయన జీవితంతో నిరూపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సుమ తన ఫిట్నెస్, ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటారని తెలిసిందే. జిమ్ వర్కౌట్స్, డైట్ వంటి విషయాల్లో ఆమె క్రమశిక్షణగా ఉంటారు. ఆమెతో పాటు ఆమె తల్లి కూడా వర్కౌట్స్ చేస్తూ జిమ్‌లో సందడి చేయడం ప్రత్యేకంగా నిలుస్తోంది. సుమ కుటుంబంతో గడిపే సమయాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తారు. భర్త రాజీవ్ కనకాల, కుమారుడు రోషన్‌తో కలిసి ఆమె తరచూ సోషల్ మీడియాలో కనిపిస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. ఇటీవలి కాలంలో సుమ, రాజీవ్ కనకాల కలిసి పలు యాడ్స్‌లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే సుమ తాతయ్య వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. “ఈ వయసులో కూడా ఇంత యాక్టివ్‌గా ఉండటం నిజంగా గొప్ప విషయం”, “ముసలోడే కానీ మహానుభావుడు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆయన ఇంకా చాలా ఏళ్ల పాటు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నారు.