Sujeeth | ‘ఓజీ’తో బ్లాక్‌బస్టర్ కొట్టిన సుజీత్.. బంగారం తాకట్టు పెట్టి మరీ తల్లి సినిమాల్లోకి పంపిందా?
Sujeeth | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూసిన ‘ఓజీ’ చిత్రం గురువారం థియేటర్లలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం, భారీ అంచనాల మధ్య ప్రేక్షకులని అలరిస్తోంది.
Sujeeth | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూసిన ‘ఓజీ’ చిత్రం గురువారం థియేటర్లలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం, భారీ అంచనాల మధ్య ప్రేక్షకులని అలరిస్తోంది. ముఖ్యంగా, పవన్ కళ్యాణ్‌ను ఇంత పవర్‌ఫుల్‌గా, స్టైలిష్‌గా ఎవరూ ప్రెజెంట్ చేయలేదని సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. ఈ విజయంతో డైరెక్టర్ సుజీత్ ఒక్కసారిగా సౌత్‌లో అగ్ర దర్శకుల సరసన చేరిపోయారని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా సుజీత్‌కి సంబంధించిన అనేక విషయాలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
సుజీత్ 1990 అక్టోబర్ 26న అనంతపురంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. సినిమాలపై చిన్నప్పటి నుంచే మక్కువ పెంచుకున్న ఆయన, ఎల్.వి. ప్రసాద్ ఫిలిం & టీవీ అకాడమీలో చదువుకున్నారు. షార్ట్ ఫిలిమ్స్ తీయాలని కోరికతో ఉన్నప్పటికీ కెమెరా కొనడానికి డబ్బులు లేవు. ఆ పరిస్థితిలో ఆయన తల్లి తన బంగారం తాకట్టు పెట్టి 44 వేల రూపాయలు తెచ్చి ఇచ్చింది. వాటితో సోనీ కెమెరా కొనిపెట్టింది. ఆ కెమెరా సుజీత్ జీవితాన్ని మార్చేసింది. సుజీత్ తీసిన షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్‌లో మంచి స్పందన తెచ్చాయి. ఆ సమయంలో పూరి జగన్నాథ్‌ని కలిసిన సుజీత్, తన షార్ట్ ఫిలిమ్స్ చూపించాడు. వాటిని చూసిన పూరి .. “నీకు అసిస్టెంట్‌గా పని చేయాల్సిన అవసరం లేదు. నువ్వే సినిమా తీయగలవు” అని ప్రోత్సహించారు. ఆ మాటలు సుజీత్ కెరీర్‌కు బలమైన స్ఫూర్తినిచ్చాయి.
యువి క్రియేషన్స్ కొత్త ట్యాలెంట్ కోసం చూస్తున్న సమయంలో, సుజీత్ వారికి రన్ రాజా రన్ కథ చెప్పాడు. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సూపర్ హిట్ అయ్యింది. ఆ విజయంతో ప్రభాస్ దృష్టిలో సుజీత్ స్థానం బలపడింది. ‘బాహుబలి 2’ షూటింగ్ సమయంలో సుజీత్ చెప్పిన సాహో కథ ప్రభాస్‌కి బాగా నచ్చింది. ఆ విధంగా కేవలం రెండో సినిమాతోనే సుజీత్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ దక్కించుకున్నారు. సాహో ఆశించిన స్థాయి విజయాన్ని సాధించకపోయినా, సుజీత్ స్టైలిష్ మేకింగ్ ఆకట్టుకుంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఓజీ’ చేయడానికి సుజీత్‌కు అవకాశం దక్కింది. ఈసారి మాత్రం అన్ని అంచనాలను మించి, బ్లాక్‌బస్టర్‌ను అందించాడు. ఫ్యాన్స్ మాస్ ఫీస్ట్‌గా ఎంజాయ్ చేస్తున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సుజీత్, ప్రవల్లిక రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ‘ఓజీ’కి పాజిటివ్ టాక్ రావడంతో ఆమె ఎమోషనల్ అవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- gold
- OG
- pawam kalyan
- Shooting
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

