Prasanna Vadanam | ఆహాలో సుహాస్ ప్రసన్నవదనం అరుదైన రికార్డు..!
Prasanna Vadanam | ఇటీవలే ప్రసన్నవదనం (Prasanna Vadanam) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు టాలీవుడ్ యువ హీరో సుహాస్ (Suhas). మే 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ సక్సెస్ఫుల్ థ్రియాట్రికల్రన్ తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫాం ఆహాలోకి ఎంట్రీ ఇచ్చిందని తెలిసిందే.
Prasanna Vadanam | ఇటీవలే ప్రసన్నవదనం (Prasanna Vadanam) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు టాలీవుడ్ యువ హీరో సుహాస్ (Suhas). మే 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. నిర్మాతలకు కూడా కాసులు కురిపించింది. కాగా ప్రసన్నవదనం డిజిటల్ ప్రపంచంలోనూ తన హవా చాటుతోంది. ఈ మూవీ సక్సెస్ఫుల్ థ్రియాట్రికల్రన్ తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫాం ఆహాలోకి ఎంట్రీ ఇచ్చిందని తెలిసిందే.
ఈ మూవీ ఓటీటీలోనూ తన సత్తా ఏంటో చూపిస్తోంది. ప్రసన్నవదనం ఆహాలో 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్‌ను వేగంగా అధిగమించిన సినిమాగా అరుదైన రికార్డు నమోదు చేసింది. సినిమా కంటెంట్‌ను ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తున్నారో ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవచ్చు.
అర్జున్ వైకే డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్, నందు, వివా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని మణికంఠ, ప్రసాద్ సంయుక్తంగా తెరకెక్కించగా.. విజయ్ బల్గానిన్ కీలక పాత్ర పోషించారు. సుహాస్ మరోవైపు రామ్ పసుపులేటి దర్శకత్వంలో నటిస్తున్న ఆనందరావ్ అడ్వంచర్స్ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
50M+ minutes of edge-of-your-seat suspense!
Watch Summer’s First Blockbuster #PrasannaVadanam streaming now only on Aha!
now▶️https://t.co/VugRE9Ns1I @ActorSuhas @payal_radhu @RashiReal_ @ManikantaJS @edwardpereji9 @harshachemudu @LTHcinemas @adityamusic pic.twitter.com/EstvoZ8wLa— ahavideoin (@ahavideoIN) May 27, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

