ఎమోషనల్ లవ్‌స్టోరీగా హైడ్ అండ్ సిల్క్
‘మందాడి’ బ్లాక్‌బస్టర్ తర్వాత సుహాస్ నటిస్తున్న సినిమా ‘హైడ్ అండ్ సిల్క్'. రాజేంద్రబాల దర్శకుడు. స్టోన్బెచ్ స్టూడియోస్ అధినేత కార్తికేయన్ సంతానం.. మిస్రిలాల్ పిక్చర్స్ వర్తికా జైన్‌తో కలిసి నిర్మిస్తున్న ఈచిత్రంలో సంజన కృష్ణమూర్తి కథానాయిక. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో సోమవారం జరిగింది. ‘చాలా పెద్ద టీమ్ కలిసి పనిచేసిన సినిమా ‘హైడ్ అండ్ సిల్క్'. ‘పేట’ సినిమా టైమ్‌లో ‘నువ్వు సినిమా చేస్తే మేమంతా కలిసి పనిచేస్తాం’ అని దర్శకుడు బాలాకు కార్తీక్ సుబ్బరాజు మాటిచ్చారు.
‘మందాడి’ బ్లాక్‌బస్టర్ తర్వాత సుహాస్ నటిస్తున్న సినిమా ‘హైడ్ అండ్ సిల్క్’. రాజేంద్రబాల దర్శకుడు. స్టోన్బెచ్ స్టూడియోస్ అధినేత కార్తికేయన్ సంతానం.. మిస్రిలాల్ పిక్చర్స్ వర్తికా జైన్‌తో కలిసి నిర్మిస్తున్న ఈచిత్రంలో సంజన కృష్ణమూర్తి కథానాయిక. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో సోమవారం జరిగింది. ‘చాలా పెద్ద టీమ్ కలిసి పనిచేసిన సినిమా ‘హైడ్ అండ్ సిల్క్’. ‘పేట’ సినిమా టైమ్‌లో ‘నువ్వు సినిమా చేస్తే మేమంతా కలిసి పనిచేస్తాం’ అని దర్శకుడు బాలాకు కార్తీక్ సుబ్బరాజు మాటిచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం వారి టీమ్ అంతా ఈసినిమాకు పనిచేశారు. వారంతా పనిచేయడం సినిమాకు కలిసొచ్చింది. తనికెళ్ల భరణి, నందు మంచి పాత్రలు చేశారు. ఈ టీమ్‌లో ఏ ఒక్కరూ లేకపోయినా సినిమా పూర్తయ్యేది కాదు’ అని సుహాస్ అన్నారు. ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్న రాజేంద్రబాలా తన దగ్గర సహాయకుడిగా పనిచేశాడని, తనకు కమర్షియల్ సినిమాలంటే ఇష్టమని, కానీ తొలి సినిమా కాబట్టి బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకొని తను ప్రేమకథ తీశాడని, ఇందులో ఎమోషన్స్, కామెడీ అంతా బావుంటాయని అగ్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు అన్నారు. తన గురువు కార్తీక్ సుబ్బరాజు గర్వపడే సినిమానే తీశానని దర్శకుడు రాజేంద్రబాలా నమ్మకంగా చెప్పారు. ఇంకా తనికెళ్ల భరణి, నందు, లిరిక్ రైటర్ కృష్ణకాంత్, సంగీత దర్శకుడు అమృత్, ఆర్ట్ డైరెక్టర్ సురేశ్ సెల్వరాజన్, డీవోపీ కార్తీక్ పళని, నిర్మాతలు వర్తికా జైన్, కార్తికేయన్ సంతానం కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

