ఒక్క కరెక్షన్ కూడా చేప్పలేకపోయా.. సుకుమార్
‘సుహాస్ అంటే నాకూ, బన్నీకీ చాలా ఇష్టం. ‘పుష్ప’లో హీరో ఫ్రెండ్ కేశవ కేరక్టర్‌కి ముందు సుహాస్నే అనుకున్నాం. కానీ అప్పటికే తను హీరో అయిపోయాడు. దాతో కుదర్లేదు. హీరో నానిలా సుహాస్ కూడా సహజ నటుడు. భవిష్యత్తులో తను కూడా నాని అంత ఎదుగుతాడనిపిస్తుంది.’
‘సుహాస్ అంటే నాకూ, బన్నీకీ చాలా ఇష్టం. ‘పుష్ప’లో హీరో ఫ్రెండ్ కేశవ కేరక్టర్‌కి ముందు సుహాస్నే అనుకున్నాం. కానీ అప్పటికే తను హీరో అయిపోయాడు. దాతో కుదర్లేదు. హీరో నానిలా సుహాస్ కూడా సహజ నటుడు. భవిష్యత్తులో తను కూడా నాని అంత ఎదుగుతాడనిపిస్తుంది.’ అని అగ్ర దర్శకుడు సుకుమార్ అన్నారు. సుహాస్ హీరోగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్రసన్నవదనం’. పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ కథానాయికలు. అర్జున్ వై.కె దర్శకుడు. జేఎస్ మణికంఠ, టి.ఆర్.ప్రసాద్‌రెడ్డి నిర్మాతలు.
మే 3న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్ కలిపి హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన సుకుమార్ ఇంకా మాట్లాడుతూ ‘ఈ సినిమా చూశాను. ఏ కరక్షన్ చెప్పలేకపోయాను. అంత చక్కగా తీశాడు దర్శకుడు అర్జున్. ‘జగడం’ టైమ్‌లో తను నన్ను కలిశాడు. నా దగ్గర పనిచేయాలనే కోరికను వ్యక్తం చేశాడు.
నా టీమ్‌లోకి తీసుకున్నాను. కలిసి పనిచేశాక అతని పనితనం తెలిసింది. ‘100 పర్సంట్ లవ్’ సినిమా కథను అతనితోనే కలిసి 23రోజుల్లో రాశాను. లాజిక్ తెలిసిన దర్శకుడు తను. హాలీవుడ్లో ఉండివుంటే మరోస్థాయి సినిమా తీసేవాడు. ఈ సినిమా కూడా అద్భుతంగా తీశాడు. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’ అని నమ్మకం వ్యక్తం చేశారు సుకుమార్. తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని, ప్రేక్షకులు థియేటర్ల దాకా వస్తే చాలు.. మిగతాది మేం చూసుకుంటామనీ, కచ్చితంగా సినిమా అందరినీ నచ్చుతుందని హీరో సుహాస్ అన్నారు. ‘నిర్మాతల సహకారంతో సినిమాను అనుకున్నదానికంటే గ్రాండ్‌గా చేశాం. సహకరించిన అందరికీ ధన్యవాదాలు’ అని దర్శకుడు చెప్పారు. ఇంకా అతిథులుగా విచ్చేసిన దర్శకులు బుచ్చిబాబు సాన, కార్తీక్ దండులతో పాటు నటుడు అవసరాల శ్రీనివాస్, కథానాయికలు రాశీసింగ్, పాయిల్ రాధాకృష్ఱ, నిర్మాత మణికంఠ, ప్రసాదరెడ్డి కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

