Sudheer Babu | మనందరి సూపర్‌హీరో నాన్న.. సుధీర్‌బాబు
‘ఈ సినిమాలోని ప్రతీ సన్నివేశం సహజంగా అనిపిస్తుంది. కథ మొత్తం ఫాదర్ సెంటిమెంట్‌తో ముడిపడి ఉంటుంది. నా కెరీర్లో బాగా సంతృప్తినిచ్చిన చిత్రమిది’ అన్నారు సుధీర్‌బాబు.
Sudheer Babu | ‘ఈ సినిమాలోని ప్రతీ సన్నివేశం సహజంగా అనిపిస్తుంది. కథ మొత్తం ఫాదర్ సెంటిమెంట్‌తో ముడిపడి ఉంటుంది. నా కెరీర్లో బాగా సంతృప్తినిచ్చిన చిత్రమిది’ అన్నారు సుధీర్‌బాబు. ఆయన హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో సునీల్ బలుసు నిర్మించిన ‘మా నాన్న సూపర్‌హీరో’ చిత్రం ఈ నెల 11న విడుదలకానుంది.
ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘కన్నతండ్రి, పెంపుడు తండ్రి, ఒక కొడుకు చుట్టూ భావోద్వేగభరితంగా నడిచే కథ ఇది. యూనివర్సల్ పాయింట్ కాబట్టి అందరికి కనెక్ట్ అవుతుంది. మానవ సంబంధాల్లోని గాఢతను ఆవిష్కరిస్తుంది. మనందరి జీవితాల్లో సూపర్‌హీరో నాన్నే. ఈ కథలో హీరో తండ్రిని ఎంతగానో ప్రేమిస్తుంటాడు. అతనే సర్వస్వంగా బతుకుతుంటాడు.
ఈ క్రమంలో అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది కథలో ఆసక్తిని పంచుతుంది. ఈ సినిమాలోని ఎమోషన్స్ ప్రతి ఒక్కరిని కదిలిస్తాయి’ అన్నారు. మహేష్‌బాబు ఈ సినిమా టీజర్ చూసి ఎంతగానో ప్రశంసించారని, హార్ట్‌టచింగ్‌గా ఉందన్నారని సుధీర్‌బాబు తెలిపారు.మనసుకు నచ్చిన కథలతో సినిమాలు చేస్తున్నానని, ప్రస్తుతం ‘జటాధరా’ షూటింగ్ జరుగుతున్నదని, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని సుధీర్‌బాబు పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

