Suriya 43 | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం పీరియాడిక్ ప్రాజెక్ట్ కంగువలో నటిస్తున్న విషయం తెలిసిందే. సూర్య 42 (Suriya 42)గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా లేడీ డైరెక్టర్ సుధాకొంగర (Sudha Kongara) దర్శకత్వంలో సూర్య 43 మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇంట్రెస్టింగ్ స్టిల్‌తో అప్డేట్ అందించారు సుధా కొంగర. మా తదుపరి చిత్రం సూర్య 43 అంటూ ఆకాశం నీ హద్దురా (సూరారై పోట్రు) వర్కింగ్ స్టిల్ ఒకటి షేర్ చేశారు.
పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని సమాచారం. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.సూర్య ఇప్పటికే వెట్రిమారన్ దర్శకత్వంలో జల్లికట్టు నేపథ్యంలో వాడివాసల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. దీనికి సంబంధించిన షూటింగ్ అప్డేట్ రావాల్సి ఉంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం వాడివాసల్కు ముందే సూర్య 43ని సెట్స్‌పైకి తీసుకెళ్లనుంది సూర్య టీం.
కంగువలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మేకర్స్ కంగువ నుంచి విడుదల చేసిన రషెస్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. కంగువ 2డీ, 3డీ ఫార్మాట్లలో 10 భాషల్లో విడుదల కానుంది.
దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. సూర్య మరోవైపు అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తున్న సూరారై పోట్రు హిందీ రీమేక్‌లో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Our Next..#Suriya43 pic.twitter.com/IFjAFe8qhq
— Sudha Kongara (@Sudha_Kongra) June 12, 2023