Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
Jabardasth Emmanuel | ప్రముఖ హాస్య నటుడు, జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘డెస్టినీ’. కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దినేష్ కుర్ర నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
Jabardasth Emmanuel | ప్రముఖ హాస్య నటుడు, జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘డెస్టినీ’. కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దినేష్ కుర్ర నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ చెందు ముద్దు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నందినీ రెడ్డి విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు.
‘డెస్టినీ’ టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అత్యంత ఆసక్తికరంగా డిజైన్ చేశారు. పోస్టర్లో ఇమ్మాన్యుయేల్ చేతికి సంకెళ్లు వేసి ఉండటం, అతనితో పాటు ఒక కానిస్టేబుల్ ఉండటం, అలాగే ఒక అడవి దారి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సన్నివేశం ఉండటం సినిమాపై అంచనాలను పెంచుతోంది. టైటిల్ లోగోలో కూడా ఈ ఇద్దరి పాత్రలు కనిపించడం గమనార్హం. వీళ్లిద్దరి ప్రయాణమే ఈ సినిమా కథాంశమని పోస్టర్‌ను చూస్తే స్పష్టమవుతోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఇతర అప్డేట్స్ను మేకర్స్ ప్రకటించనున్నారు.
ఈ చిత్రంలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ హీరోగా నటిస్తుండగా.. శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: చెందు ముద్దు కాగా, నిర్మాత: దినేష్ కుర్ర, సమర్పణ: కె. రాఘవేంద్ర రెడ్డి, బ్యానర్: కుర్ర ప్రొడక్షన్స్, సినిమాటోగ్రఫీ (DOP): పంకజ్ తొట్టాడ, ఎడిటర్: డి. వెంకట ప్రభు, సంగీతం: మారుతీ రాజా, ప్రాజెక్ట్ ప్లానింగ్ & రూపకల్పన: చంద్రహాస్ కోట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్ర బాలాజీ, పబ్లిసిటీ డిజైన్స్: ఎ డిజైన్ ఫ్యాక్టరీ, పీఆర్వో సాయి సతీష్ వ్యవహరిస్తున్నారు.

Destiny Movie
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

