శక్తివంతమైన నేపథ్యాలతో స్వయంభు
‘కార్తికేయ 2’తో పానిండియా విజయాన్ని అందుకున్న హీరో నిఖిల్ నటిస్తున్న మరో పానిండియా హిస్టారిక్ యాక్షన్ ఎపిక్ ‘స్వయంభు’. లెజెండరీ యోధునిగా ఇందులో నిఖిల్ కనిపించనున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకుడు. భువన్, శ్రీకర్ నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది.
‘కార్తికేయ 2’తో పానిండియా విజయాన్ని అందుకున్న హీరో నిఖిల్ నటిస్తున్న మరో పానిండియా హిస్టారిక్ యాక్షన్ ఎపిక్ ‘స్వయంభు’. లెజెండరీ యోధునిగా ఇందులో నిఖిల్ కనిపించనున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకుడు. భువన్, శ్రీకర్ నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఈ సినిమాకు సంబంధించిన పవర్ఫుల్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. నిఖిల్, సంయుక్త మీనన్ యుద్ధం చేస్తూ ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. సినిమా గ్రాండ్ స్కేల్‌ని ప్రజెంట్ చేసేలా ఈ పోస్టర్ ఉన్నది.
న్యాయమైన నాయకత్వానికి ఉదాహరణగా, నీతిమంతమైన పాలనకు చిహ్నంగా నిలిచిన సెంగోల్ ఈ పోస్టర్ నేపథ్యంలో కనిపించడం ఆసక్తికరంగా ఉంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడి సైతం భారతీయ వారసత్వానికి నివాళులర్పిస్తూ కొత్త పార్లమెంట్ భవనంలోని స్పీకర్ సీటు దగ్గర ఈ సెంగోల్‌ను ప్రతిష్టించారని నిర్మాతలు గుర్తు చేశారు. అద్భుతమైన కథతో శక్తివంతమైన నేపథ్యాల చుట్టూ ఈ కథ నడుస్తుందని మేకర్స్ తెలిపారు. నభా నటేష్ మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: విజయ్ కామిశెట్టి, కెమెరా: కె.కె.సెంథిల్ కుమార్, సంగీతం: రవి బస్రూర్, సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాణం: పిక్సెల్ స్టూడియోస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

