Pooja Hegde | బుట్టబొమ్మ పూజా హెగ్దే.. టాలీవుడ్లో సక్సెస్ హీరోయిన్గా దూసుకెళ్తోంది. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్లో సైతం వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. కాగా, ఈ నటి ఇటీవల ముంబయిలో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసి తన సొంతింటి కలను నిజం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ ఇంటిని హోమ్‌టూర్ ద్వారా అభిమానులకు పరిచయం చేసింది బుట్టబొమ్మ.
ఇల్లు మొత్తం చాలా క్లాసీగా, స్టైలిష్‌గా ఉంది. ఫ్లోరింగ్, సీలింగ్ ట్రెండీ లుక్‌లో కనిపించింది. ఇక వీడియోలో డోర్ ఎంట్రెన్స్‌లో పూజా హెగ్దే పేరుతో ఉన్న నేమ్‌ప్లేట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూజా తన అభిరుచికి తగ్గట్టుగా ఆ ఇంటిని డిజైన్ చేయించుకున్నట్టు తెలిపింది. వీడియోలో లివింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్, డైనింగ్ హాల్, బెడ్రూమ్, ఇంట్లో తనకు ఇష్టమైన చోటును అభిమానులకు చూపించింది. వీటితోపాటు తన షూ కలెక్షన్, హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ సైతం వీడియోలో కవర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.