Game Changer | గేమ్ ఛేంజర్ రాంచరణ్ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో తెలుసా..?
Game Changer | టాలీవుడ్ స్టార్ యాక్టర్ రాంచరణ్ (Ram Charan) కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్ (Game changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పాటలు చిత్రీకరించాల్సి ఉండగా.. రానున్న రోజుల్లో సాంగ్స్ షూట్ కోసం ప్రత్యేక ప్రణాళికను రెడీ చేసిందట శంకర్ టీం.
Game Changer | టాలీవుడ్ స్టార్ యాక్టర్ రాంచరణ్ (Ram Charan) కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్ (Game changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో పాటలు చిత్రీకరించాల్సి ఉండగా.. రానున్న రోజుల్లో సాంగ్స్ షూట్ కోసం ప్రత్యేక ప్రణాళికను రెడీ చేసిందట శంకర్ టీం.
ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్‌లో రాంచరణ్‌కు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసేదెవరో తెలుసా..? పాపులర్ బీటౌన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా. తాజా టాక్ ప్రకారం గేమ్ ఛేంజర్‌లో అన్ని పాటలకు మనీష్ మల్హోత్రా (Manish Malhotra) కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేయబోతున్నాడట. మనీష్ మల్హోత్రా ఇప్పటివరకు రాంచరణ్ కోసం కొన్ని యాడ్స్‌తోపాటు వెడ్డింగ్ ఈవెంట్‌కు పనిచేయగా.. సినిమాకు మాత్రం పనిచేయలేదు. గేమ్ ఛేంజర్‌తో సినిమా చేయని లోటు తీరిపోనుందన్న మాట. దీనిపై మేకర్స్ ఏదైనా అధికారిక ప్రకటన జారీ చేస్తారేమో చూడాలి.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న గేమ్ ఛేంజర్‌లో రాజోలు భామ అంజలి, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. గేమ్ ఛేంజర్‌కు పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు
రాంచరణ్ మరోవైపు బుచ్చిబాబు సాన డైరెక్షన్లో ఆర్సీ 16కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో సాయిపల్లవిని తీసుకున్నట్టు వార్తలు వస్తుండగా.. దీనిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.

Manish Malhotra
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

