SSMB28 Movie | మహేష్-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ పరుగులు పెడుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. సూపర్ స్టార్ అలా సిగరెట్‌తో వాకింగ్ చేస్తున్న స్టిల్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. ఈ మధ్య ఎక్కువగా మహేష్ క్లాస్ క్యారెక్టర్ ఉన్న పాత్రలే చేశాడు. కాగా ఈ సినిమాలో మాత్రం మాస్ టచ్ ఉన్న పాత్ర చేస్తున్నట్లు పోస్టర్‌తోనే స్పష్టమైంది. ఎంతైనా అభిమాన హీరోలు మాస్ టచ్ ఉన్న పాత్రలు చేస్తే ఆ కిక్కే వేరప్ప. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సినిమా గ్లింప్స్ సూపర్‌స్టార్ కృష్ణ బర్త్‌డే సందర్భంగా బుధవారం రిలీజ్ కానుంది.
మోసగాళ్లకు మోసగాడు రీ-రిలీజ్ అయ్యే థియేటర్లలో ఈ గ్లింప్స్ రిలీజ్ కానుంది. కాగా తాజాగా చిత్రబృందం గ్లింప్స్ రిలీజయ్యే టైమ్‌ను వెల్లడించింది. బుధవారం సాయంత్రం 6.03 గంటలకు ఈ సినిమా గ్లింప్స్‌ను ఫ్యాన్స్ రివీల్ చేస్తారని మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు అమరావతికి అటు ఇటు, గుంటూరు కారం అనే రెండు టైటిల్స్‌ను పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తుంది. దాదాపుగా ఈ రెండిట్లో ఒకటి కన్ఫర్మ్ అని టాక్. ఇక గురూజీ ఎప్పటిలాగే తనకు అచ్చొచ్చిన అ సెంటిమెంట్ ప్రకారం అమరావతి అని ఫిక్సయ్యాడట. అయితే మాస్ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో మహేష్ మాత్రం గుంటూరు కారం టైటిల్ వైపే మొగ్గుచూపుతున్నాడు. మరీ ఈ రెండింట్లో ఏది ఫైనల్ అవుతుందో తెలియాలంటే ఒక రోజు వేచి చూడాల్సిందే.
యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మహేష్‌కు జోడీగా పూజాహెగ్డే, శ్రీలీలు నటిస్తున్నారు. ఇక త్రివిక్రమ్-మహేష్ కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ సాధించకపోయినా.. బుల్లితెరపై మాత్రం అదరగొట్టాయి. ఇప్పటికీ ఈ రెండు సినిమాలు టీవీల్లో వస్తున్నాయంటే వాటికే అతుక్కు పోతుంటాం. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ తెరకెక్కుతుండటంతో అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది.
Witness the Magnificent Thunderous #SSMB28MassStrike unveiled by fans at #MosagallakuMosagadu4K screening theatres from 6:03 PM onwards, TOMORROW! 🤩
Let’s celebrate the Vintage Mass of our Superstar this May 31st! 🔥🔥
Super 🌟 @urstrulyMahesh #Trivikram @hegdepooja… pic.twitter.com/IZhxfrLz0o
— Haarika & Hassine Creations (@haarikahassine) May 30, 2023