SSMB 29 | ఎస్ఎస్ఎంబీ 29 నయా అప్డేట్.. ఎస్ఎస్ రాజమౌళి టీం గుడ్‌న్యూస్ !
SSMB 29 | ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) డైరెక్ట్ చేయనున్న ఎస్ఎస్ఎంబీ 29 (ssmb29) గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్టుగా రాబోతున్నట్టు ఇప్పటికే అప్డేట్స్ కూడా తెరపైకి వచ్చాయి. తాజాగా మహేశ్ బాబు (Maheshbabu) అభిమానులను ఖుషీ చేసే వార్త ఒకటి బయటకు వచ్చింది.
SSMB 29 | ఆర్ఆర్ఆర్ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంపౌండ్ నుంచి ఎస్ఎస్ఎంబీ 29 (ssmb29) రాబోతున్న విషయం తెలిసిందే. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ఇదివరకెన్నడూ రాని విధంగా గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్టుగా రాబోతున్నట్టు ఇప్పటికే అప్డేట్స్ కూడా తెరపైకి వచ్చాయి. మహేశ్ బాబు (Maheshbabu)ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉండగా.. జక్కన్న ఎస్ఎస్ఎంబీ 29 పనులపై ఫోకస్ పెట్టాడు. తాజాగా మహేశ్ బాబు అభిమానులను ఖుషీ చేసే వార్త ఒకటి బయటకు వచ్చింది.
తాజా అప్డేట్ ప్రకారం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జులై చివరకల్లా పూర్తవనుంది. నా కథ జులై కల్లా పూర్తవుతుంది ఎమోషన్స్‌తో కూడిన అడ్వెంచరస్, యాక్షన్ డ్రామా నేపథ్యంలో Raiders of the Lost Ark (1981) లైన్లో ఉండబోతుంది. సీక్వెల్ తెరతీసేలా క్లైమాక్స్‌ను ఉండబోతుంది..అని రైటర్ విజయేంద్రప్రసాద్ చెప్పిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ లెక్కన ముందుగా వచ్చిన వార్తల ప్రకారం వీలైనంత త్వరలోనే ఎస్ఎస్ఎంబీ 29 ప్రాజెక్ట్ లాంఛ్ కావడం పక్కా అని తెలిసిపోతుంది.
ఎస్ఎస్ఎంబీ 29లో మహేశ్ బాబు పాత్ర లార్డ్హనుమాన్ స్ఫూర్తిగా జంగిల్ అడ్వెంచర్ నేపథ్యంలో సాగనుందని ఇప్పటికే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఎస్ఎస్ఎంబీ 29 ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా రానుందని ఇన్సైడ్ టాక్. ఎస్ఎస్ఎంబీ 29లో ఎక్కువ భాగం అమెజాన్ ఫారెస్ట్‌లో చిత్రీకరించబడుతుందని సమాచారం.
ఇటీవలే లాంఛ్ చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ అభిమానులకు కావాల్సిన ఫుల్ మీల్స్ అందివ్వబోతున్నట్టు చెబుతోంది. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తవగానే జక్కన్న ప్రాజెక్టుతో బిజీగా కానున్నాడు మహేశ్ బాబు.
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆలయ ప్రాంగణంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. రూ.13,200 నగదు స్వాధీనం
Priya Bhavani Shankar | ప్రియుడితో ఏడడుగులు వేసిన ఇరుముడి హీరోయిన్.. క్యూట్ పిక్స్ షేర్ చేసిన ప్రియా భవాని
RTC Bus Pass | బస్‌పాస్ జారీలో గందరగోళం.. ఇష్టానుసారంగా బస్ పాస్‌లు జారీ చేస్తున్న ఆర్టీసీ
Kamal Haasan | టైటిల్ వివాదంలో ‘సండియర్’.. గతంలో విరుమాండి’గా పేరు మార్పు..!
Ramayana Movie | ఆస్కార్ బరిలో ‘రామాయణ’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

