సాహస యాత్రకు శ్రీకారం
మహేష్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిస్తున్న గ్లోబల్ యాక్షన్ ఎంటర్టైనర్ గురువారం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైనట్లు సమాచారం.
మహేష్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిస్తున్న గ్లోబల్ యాక్షన్ ఎంటర్టైనర్ గురువారం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైనట్లు సమాచారం. ఈ వేడుకలో మహేష్‌బాబు కూడా పాల్గొన్నారని తెలిసింది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
అయితే ఈ వేడుకకు సంబంధించినవిగా చెబుతున్న కొన్ని వీడియోలు సోషల్‌మీడియాలో కనిపించాయి. వేసవిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. అమెజాన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
ఇందులో పలువురు హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు భాగం కాబోతున్నారు. అత్యున్నత సాంకేతిక హంగులు, వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్‌తో తనదైన శైలి ఇంటెన్స్ యాక్షన్, ఎమోషన్స్‌తో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని తెలిసింది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్నందిస్తుండగా, దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
Loksabha Elections | ఢిల్లీని పట్టినోడే బాద్షా.. జాతీయ పార్టీలతో కలబడితేనే తెలంగాణ నిలబడేది!
Horoscope | 28-11-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
చంపేయండి.. బెయిల్ ఇప్పిస్తా!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

