DVV Entertainment | చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్ టీం.. ట్రెండింగ్‌లో రాజమౌళి ఫొటో
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ (Oscars 2023) పురస్కారాల్లో ఆర్ఆర్ఆర్ (RRR) నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ అరుదైన క్షణాలను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ (DVV Entertainment) అండ్ ఆర్ఆర్ఆర్ టీం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.
DVV Entertainment | చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగరాయాలన్నా మేమే.. ఈ పవర్ ఫుల్ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ డైలాగ్ ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) అండ్ టీంకు పర్ఫెక్ట్గా సరిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ (Oscars 2023) పురస్కారాల్లో ఆర్ఆర్ఆర్ (RRR) నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.
ఈ అరుదైన క్షణాలను ఆర్ఆర్ఆర్ టీం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ లాంటి అద్బుతమైన సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన క్రెడిట్లో అగ్రభాగం చిత్రనిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ (DVV Entertainment) కు దక్కుతుంది. స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించారు. ఎన్నో ఏండ్ల కలను సాకారం చేసుకున్న సందర్భంగా రాజమౌళి బ్యాక్ లుక్ ఫొటోను షేర్ చేస్తూ.. తన ఎక్జయిట్‌మెంట్‌ను అందరితో పంచుకుంది డీవీవీ ఎంటర్టైన్మెంట్స్.
ఆర్ఆర్ఆర్.. ఎస్ఎస్ రాజమౌళి సినిమా.. చరిత్ర సృష్టించబడింది.. అంటూ అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది డీవీవీ ఎంటర్టైన్మెంట్స్. షూటింగ్ లొకేషన్ బ్లాస్టింగ్ అవుతున్న విజువల్స్ ను జక్కన్న వీక్షిస్తున్న స్టిల్‌ను షేర్ చేసింది. బ్లూ షర్ట్, వైట్ లుంగీలో ఉన్న జక్కన్న స్టిల్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
AN SS RAJAMOULI FILM…
HISTORY HAS BEEN CREATED… #NaatuNaatu #Oscars #RRRMovie pic.twitter.com/WgxFpMqBsL
— DVV Entertainment (@DVVMovies) March 13, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

