Sruthi Hassan | శృతి హాసన్ కొత్త ఇంటి గృహప్రవేశం.. కుటుంబ సభ్యులు కనిపించకపోవడంపై సందేహాలు
Sruthi Hassan | టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్, ప్రముఖ గాయని శృతి హాసన్ జీవితంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎన్నో విజయాలతో సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న శృతి తాజాగా చెన్నైలో ఓ విలాసవంతమైన కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా గృహప్రవేశ వేడుక నిర్వహించి, కుటుంబ ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు.
Sruthi Hassan | టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్, ప్రముఖ గాయని శృతి హాసన్ జీవితంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎన్నో విజయాలతో సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న శృతి తాజాగా చెన్నైలో ఓ విలాసవంతమైన కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా గృహప్రవేశ వేడుక నిర్వహించి, కుటుంబ ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి క్షణాల్లో వైరల్గా మారాయి.ఈ వేడుకలో శృతి హాసన్ సంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించారు. పూజా కార్యక్రమాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ఆమె ఫొటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. కొత్త ఇంటిని స్వయంగా తన కష్టార్జితంతో కొనుగోలు చేయడం పట్ల అభిమానులు అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అయితే ఈ ఫొటోలు సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి. గతంలో పలు ఇంటర్వ్యూల్లో తాను నాస్తికురాలినని శృతి హాసన్ చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ కొందరు నెటిజన్లు ఇప్పుడు సంప్రదాయ పూజలు చేయడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నాస్తికురాలినని చెప్పి ఇప్పుడు గృహప్రవేశ పూజలు ఎందుకు? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు వ్యక్తిగత విశ్వాసాలు కాలానుగుణంగా మారవచ్చని, ఒకరి వ్యక్తిగత నిర్ణయాలను విమర్శించడం సరికాదని మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇంకో విషయం కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ గృహప్రవేశ వేడుకలో శృతి తల్లిదండ్రులు కమల్ హాసన్, సారికతో పాటు సోదరి అక్షర హాసన్ కనిపించకపోవడం చర్చనీయాంశమైంది.
ఇంత ముఖ్యమైన కుటుంబ వేడుకకు వారు హాజరు కాకపోవడానికి కారణమేంటని కొందరు ప్రశ్నిస్తుండగా, సెలబ్రిటీల బిజీ షెడ్యూల్స్ కారణంగా ప్రతి కార్యక్రమానికి హాజరు కావడం సాధ్యం కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, కమల్ హాసన్ వారసురాలిగా సినీ రంగంలో అడుగుపెట్టిన అక్షర హాసన్ ప్రస్తుతం వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. బాలీవుడ్ చిత్రం షమితాబ్తో నటిగా పరిచయమైన ఆమె, తర్వాత వివేగం, కడారమ్ కొండన్ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం నటన కంటే సినిమా నిర్మాణం, స్క్రిప్ట్ డెవలప్మెంట్, సాంకేతిక విభాగాలపై ఎక్కువ దృష్టి సారిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ నేత దౌర్జన్యం.. సంక్షేమ సంఘం కార్యదర్శిపై బూతుపురాణం
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
Palamuru | నీళ్లెత్తేందుకు ఎందుకిన్ని డ్రామాలు.. విడుదల చేసిన నీళ్లు బీర్ల తయారీ కోసమా .. పొలాలకా!
Srisailam Project | నీళ్లన్నీ సద్దికట్టి.. నేడు సుద్దులు.. రేవంత్ సర్కార్ వైఫల్యంతో శ్రీశైలం ఖాళీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

