Mahnoor Baloch | షారూఖ్ ఖాన్‌పై పాకిస్థానీ నటి సంచలన వ్యాఖ్యలు.. నటనే రాని ఆయన హీరో అయ్యాడంటే కారణం అదే
Mahnoor Baloch | పాకిస్థాన్‌కు చెందిన నటి మహ్నూర్ బలోచ్.. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ గురించి సంచలన కామెంట్స్ చేసింది. షారూఖ్ ఖాన్ అందగాడు కాదని, ఆయనకు నటన కూడా రాదని వ్యాఖ్యానించింది. అంతేగాక షారూఖ్ ఖాన్ ఓ పేద్ద బిజినెస్ మ్యాన్ అని, ఆయనకు తనను తాను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో బాగా తెలుసని అన్నది.
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు చెందిన నటి మహ్నూర్ బలోచ్.. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ గురించి సంచలన కామెంట్స్ చేసింది. షారూఖ్ ఖాన్ అందగాడు కాదని, ఆయనకు నటన కూడా రాదని వ్యాఖ్యానించింది. అంతేగాక షారూఖ్ ఖాన్ ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ అని, ఆయనకు తనను తాను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో బాగా తెలుసని అన్నది. కాకపోతే ఆయన మంచి వ్యక్తిత్వం, ఆయనలోని తేజస్సే ఆయనను సినీ పరిశ్రమలో ఒక పెద్ద హీరోగా నిలబెట్టాయని అభిప్రాయపడింది.
‘షారూఖ్ ఖాన్ చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషి. ఇక అందం పరంగా చూస్తే ఆయన పెద్ద అందగాడు కాదు. ఆయన వ్యక్తిత్వం, తేజస్సు చాలా బలమైనవి. అవే ఆయనను గొప్పవాడిని చేశాయి. సమాజంలో ఎంతో మంది అందగాళ్లు ఉంటారు. కానీ, ఆకర్షించే తేజస్సు, చలాకీతనం లేక అనామకులుగా మిగిలిపోతారు’ అని మహ్నూర్ బలోచ్ వ్యాఖ్యానించింది.
‘షారూఖ్ ఖాన్‌కు నటన కూడా రాదన్నది నా అభిప్రాయం. కాకపోతే ఆయన ఓ గొప్ప బిజినెస్ మ్యాన్. ఎందుకంటే తనను తాను ఎలా మార్కెట్ చేసుకోవాలో ఆయన బాగా తెలుసు. షారూఖ్ అభిమానులు, ఇతర జనాలు నాతో ఏకీభవించకపోవచ్చు. అయినా ఏం పర్వాలేదు. అతను మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు, తనను తాను చక్కగా మార్కెట్ చేసుకోగలిగినవాడు. పరిశ్రమలో ఎంతో మంది మంచి నటులున్నారు. కానీ షారూఖ్‌లా సక్సెస్ సాధించలేకపోయారు’ అని మహ్నూర్ అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఈ టాక్ షోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహ్నూర్ బలోచ్ పబ్లిసిటీ కోసం షారూఖ్‌పై కామెంట్స్ చేసిందని ఓ నెటిజన్ విమర్శించాడు. ‘సూటిగా చెప్పు.. నీకు షారూఖ్ ఖాన్ దృష్టిలో పడాలని ఉందా..?’ అని మరో నెటిజన్ ప్రశ్నించాడు. ‘షారూఖ్ ఖాన్ అంటే ప్రపంచం అంతటికి తెలుసు. నన్ను క్షమించాలి. అసలు నువ్వు ఎవరు..?’ అని ఇంకో నెటిజన్ స్పందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

