శ్రీకాంత్ కొడుకు మాస్ హీరో అయ్యేలా ఉన్నాడుగా..!

30 ఏళ్లుగా ఒకే ఇండస్ట్రీలో ఉండి 100 కు పైగా సినిమాల్లో నటించిన తర్వాత కూడా.. ఏ రకమైన ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా ఉండటం అంటే చిన్న విషయం కాదు. అది చేసి చూపించాడు సీనియర్ హీరో శ్రీకాంత్. కెరీర్ మొదట్లో విలన్‌గా నటించాడు.. హీరోగా సక్సెస్ అయిన తర్వాత కూడా మల్టీస్టారర్ సినిమాలు చేశాడు. వరుసగా హీరోగా నటిస్తున్న సమయంలోనూ ఇతర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. కథ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా వెనుకాడని హీరోలలో శ్రీకాంత్ అందరికంటే ముందుంటాడు. తాజాగా ఈయన బాలకృష్ణ అఖండ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన తనయుడు రోషన్ హీరోగా పరిచయమవుతున్నాడు. నిజానికి నాలుగేళ్ల కింద నిర్మలా కాన్వెంట్ సినిమాతోనే రోషన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా వచ్చినట్టు కూడా ప్రేక్షకులకు తెలియదు. అందుకే కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకుని.. ఇప్పుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో పెళ్లి సందడి సినిమా చేస్తున్నాడు రోషన్. ఈ సినిమా టీజర్ ఈ మధ్య విడుదలైంది. ఇది చూసిన తర్వాత శ్రీకాంత్ తన తనయుడిని ఎలాంటి హీరో చేయాలని అనుకుంటున్నారో అందరికీ క్లారిటీ వచ్చేసింది.
తనలా తన కొడుకు కూడా ఎలాంటి ఇమేజ్ లేని హీరోగా ఉండకూడదని శ్రీకాంత్ ఫిక్స్ అయిపోయాడు. అందుకే పెళ్లి సందడి లాంటి లవ్ స్టోరీలో కూడా చాలా యాక్షన్ సీక్వెన్స్‌లు, ఫైట్ సీన్స్ ఉన్నాయి. 50 సెకండ్ల టీజర్లో రోషన్ మాస్ హీరోగా ఎక్కువగా కనిపించాడు. ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో క్లాస్ కథలకు అంత ఈజీగా ఓకే చెప్పేలా కనిపించడం లేదు. తండ్రి క్లాస్ ప్లస్ మాస్ హీరో అయినా కూడా తాను మాత్రం యాక్షన్ హీరో అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయినట్లున్నాడు రోషన్. చూడ్డానికి హృతిక్ రోషన్ లా ఉండే ఈ కుర్రాడు పెళ్లి సందడి గాని విజయం సాధిస్తే ఖచ్చితంగా క్రేజీ హీరో అవుతాడు. ఎందుకంటే అతనికి తండ్రి శ్రీకాంత్ సపోర్టు ఎలాగూ ఉంది. ఆయన సపోర్ట్ అంటే మెగా ఫ్యామిలీ సపోర్ట్ కచ్చితంగా ఉంటుంది. శ్రీకాంత్‌కు ఇండస్ట్రీలో అందరితోనూ మంచి పరిచయాలు ఉన్నాయి. దాంతో రోషన్‌కు అది ఖచ్చితంగా ప్లస్ అవ్వడం ఖాయం. మరి చూడాలి ఈ కుర్రాడు ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో..!
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ప్రభాస్ టేస్టే వేరు.. వ్యానిటీ వ్యాన్ లో ప్రత్యేక సౌకర్యం ఇదే
భర్తతో కలిసి కొత్తింట్లోకి మారిన శ్రియాశరణ్
ప్రేమ కథలు చేయను..ట్రోలింగ్ చేస్తారు: నితిన్
రకుల్ వేసిన ఈ యోగాసనం గురించి తెలుసుకోవాల్సిందే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

