Peda Kapu 1 | నారప్ప సినిమాతో మళ్లీ ట్రాక్ మీదికొచ్చాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) . ఈ చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. ఈ డైరెక్టర్ చాలా కాలం తర్వాత చేయబోతున్న నెక్ట్స్ సినిమా ఏంటని ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌కు క్లారిటీ ఇచ్చేశాడు. శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమాకు పెదకాపు 1 (Peda Kapu 1) టైటిల్ ఫిక్స్ చేశాడు. విరాట్ కర్ణ (Virat Karrna) ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు.
ఏ కామన్ మ్యాన్ సిగ్నేచర్ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను లాంఛ్ చేసింది శ్రీకాంత్ అడ్దాల టీం. భారీ సమూహంలో చేయి పైకెత్తి ఏదో స్లోగన్ ఇస్తున్నట్టుగా కనిపిస్తున్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతుంది. ఈ చిత్రంలో పొలిటికల్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. కొత్త యాక్టర్ అయినా ఫస్ట్ సినిమాకే పర్ఫెక్ట్ లుక్‌తో కనిపిస్తున్నాడు విరాట్ కర్ణ. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్ కాగా.. పాపులర్ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ యాక్షన్ పార్టు కంపోజ్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్.
ఓ సామాన్యుడి సంతకం ✍️💪
Here’s the Title & 1st Look Poster of#PK1 – #PeddhaKapu1 , Introducing @ViratKarrna ✨
A #SrikanthAddala Film 🎬
Produced by @mravinderreddyyStay tuned for next BIG UPDATE 💥 pic.twitter.com/jdy9IjAKxr
— Dwaraka Creations (@dwarakacreation) June 2, 2023
A Common Man’s Fierce will lead to a new chapter 💥
Here’s the Intense Motion Poster of #PeddhaKapu1 💥
Introducing @ViratKarrna ✨@srikanthAddala_ @MickeyJMeyer@NaiduChota #MarthandKVenkatesh@mravinderreddyy pic.twitter.com/0y3afiuZWN
— Dwaraka Creations (@dwarakacreation) June 2, 2023