నటుడిగా పరిణితి సాధించాను
వంగవీటి, కథానాయకుడు, మహానాయకుడు, ధమాకా, మంగళవారం వంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు నటుడు శ్రీతేజ్.
వంగవీటి, కథానాయకుడు, మహానాయకుడు, ధమాకా, మంగళవారం వంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు నటుడు శ్రీతేజ్. ఈ ఏడాది తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ మట్లాడుతూ ‘ఇటీవల విడుదలైన ‘మంగళవారం’ చిత్రం నాకు మంచి పేరు తీసుకొచ్చింది.
ఇందులో గురజ అనే పాత్రలో నా నటన బాగుందని ప్రశంసలొచ్చాయి. రవితేజ ‘రావణాసుర’ చిత్రంలో దేవరాజ్ రోల్ చేశాను. ఈ ఏడాది నేను నటించిన ‘దళారి’ చిత్రం కూడా విడుదలైంది. ఈ సంవత్సరం వైవిధ్యమైన పాత్రలు దక్కాయి. నటుడిగా మరింత పరిణితి సాధించాను. నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలందరికీ కృతజ్ఞతలు. వచ్చే ఏడాది నేను నటిస్తున్న ‘బహిష్కరణ’ వెబ్సిరీస్ రాబోతున్నది. అలాగే ‘ర్యాంబో’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నా’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

