Sreeleela | ఇక నుంచి డాక్టర్ శ్రీలీల.. బిజీ షెడ్యూల్లోనూ ఎంబీబీఎస్ పరీక్షలు కంప్లీట్!
Sreeleela | ఇప్పుడున్న హీరోయిన్లలో శ్రీలీల అంత బిజీగా ఏ హీరోయినూ లేదు. గత ఏడాది డిసెంబర్లో విడుదలైన ‘ధమాకా’ నుంచి ఈ ఏడాది డిసెంబర్లో వచ్చిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' వరకూ పన్నెండు నెలల్లో శ్రీలీల నటించిన అయిదు సినిమాలు విడుదలయ్యాయి.
Sreeleela | ఇప్పుడున్న హీరోయిన్లలో శ్రీలీల అంత బిజీగా ఏ హీరోయినూ లేదు. గత ఏడాది డిసెంబర్లో విడుదలైన ‘ధమాకా’ నుంచి ఈ ఏడాది డిసెంబర్లో వచ్చిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ వరకూ పన్నెండు నెలల్లో శ్రీలీల నటించిన అయిదు సినిమాలు విడుదలయ్యాయి. అంటే రమారమీ రెండు నెలలకు ఓ సినిమా అన్నమాట. ఇది మామూలు రికార్డ్ కాదు. పైగా అన్నీ భారీ సినిమాలే. దీన్ని బట్టి శ్రీలీల ప్రభ ఏ స్థాయిలో వెలిగిపోతున్నదో అర్థంచేసుకోవచ్చు.
శ్రీలీల ఎంబీబీఎస్ చదువుతున్న విషయం తెలిసిందే. ఇంత బిజీలో చదువు ఎలా సాగుతున్నది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రస్తుతం శ్రీలీల ఎంబీబీఎస్ పరీక్షలు రాసే పనిలోవుంది. ఈ నెల 18 నుంచి 24 వరకూ ముంబయిలో ఎంబీబీఎస్ పరీక్షలు కావడంతో, షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి ముంబయి చెక్కేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణురాలైతే యాక్ట్రస్ శ్రీలీల కాస్తా డాక్టర్ శ్రీలీలగా మారుతుందన్నమాట. మరి హయ్యర్ స్టడీస్ అంటే మాత్రం ఈ స్థాయిలో సినిమాలు చేయడం కుదిరేపనైతే కాదు. మరి కెరీర్‌ని ఎలా ప్లాన్ చేసుకుంటుందో చూడాలి. ప్రస్తుతం శ్రీలీల చేతిలో రెండుమూడు సినిమాలు ఉన్నాయి. ఆమె నటించిన ‘గుంటూరుకారం’ సంక్రాంతికి విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంది.. ఇప్పటికీ మన ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించలేదు : హరీశ్ రావు
Saudi Arabia | సౌదీ అరేబియాలో ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

