Sreeleela | చిత్రాంగద సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది శ్రీలీల. ఆ తర్వాత చిన్న వయస్సులో తక్కువ టైంలోనే తెలుగు, కన్నడ భాషల్లో స్టార్ హీరోలతో నటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇటీవలే పరాశక్తి సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మూవీ మిక్స్డ్ టాక్‌తోనే సరిపెట్టుకొని శ్రీలీలకు ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేకపోయింది.
ఇదిలా ఉంటే నెట్టింట శ్రీలీల నయా అవతార్‌లో కనిపిస్తున్న ఫొటోలు కొన్ని ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ హాట్ హాట్‌గా ట్రెండీ కాస్ట్యూమ్స్‌లో సందడి చేసే ఈ అమ్మడు ఈ సారి మాత్రం ముద్దుగా సంప్రదాయ చీరకట్టులో మెరిసింది. సాఫ్ట్ లీలాక్ సారీలో బీచ్ తీరంలో సందడి చేసింది.
బీచ్ అందాలను ఆస్వాదిస్తూ.. తీరంలోని ఇసుక తిన్నెల్లో హొయలు పోతూ.. బాపూ గీసిన బొమ్మలా మెరిసిపోతూ కనిపించింది. జాయ్ ఫుల్ మూమెంట్స్‌కు సంబంధించి ఫొటోగ్రఫర్ స్వాతి శేఖరన్ తీసిన స్టిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. చీరకట్టులో శ్రీలీల అందాలకు మంత్రముగ్దులవుతున్నారు మూవీ లవర్స్, అభిమానులు, నెటిజన్లు.
శ్రీలీల ప్రస్తుతం పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‌లో నటిస్తోంది. మరికొన్ని బాలీవుడ్ సినిమాలను కూడా లైన్లో పెట్టింది.

View this post on Instagram
A post shared by Swathy Sekaran – Photographer (@swathysekaranphotographer)