బాలీవుడ్లో మరో బంపరాఫర్
దక్షిణాది యువతరంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న అచ్చ తెలుగందం శ్రీలీల ఇప్పుడు హిందీలో కూడా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నది.
దక్షిణాది యువతరంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న అచ్చ తెలుగందం శ్రీలీల ఇప్పుడు హిందీలో కూడా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నది. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్‌తో కలిసి అనురాగ్‌బసు దర్శకత్వంలో ఓ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాలో శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ భామ హిందీలో మరో బంపరాఫర్‌ను దక్కించుకుంది.
సిద్ధార్థ్ గుప్తా ప్రధాన పాత్రలో రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం తెరకెక్కుతున్నది. దీనికి ఉమేశ్ బిష్ట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీకపూర్, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ శుక్రవారం ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్లో ప్రారంభమైంది. ముక్కోణపు ప్రేమకథా చిత్రమిదని సమాచారం. బాలాజీ మోషన్ పిక్చర్స్ పతాకంపై ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్లో తొలి చిత్రం రిలీజ్ కాకముందే మరో భారీ ఆఫర్‌తో శ్రీలీల అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

