NBK 108 | శ్రీలీల ఎన్బీకే 108లో బాలకృష్ణ కూతురు కాదట.. క్రేజీ అప్డేట్..!
NBK 108 | నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తోన్న తాజా చిత్రం ఎన్బీకే 108 (NBK 108). ఇప్పటికే బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో పెళ్లి సందD ఫేం శ్రీలీల (Sreeleela) కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
NBK 108 | టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తోన్న తాజా చిత్రం ఎన్బీకే 108 (NBK 108). అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన స్టిల్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ ఈ సారి కూడా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న లుక్స్‌లో కనిపించబోతున్నట్టు హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్.
మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఎన్బీకే 108లో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో పెళ్లి సందD ఫేం శ్రీలీల (Sreeleela) కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. శ్రీలీల ఇందులో బాలయ్య కూతురుగా కనిపించబోతున్నట్టు ఇప్పటిదాకా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కాగా దీనికి సంబంధించి మరో వార్త తెరపైకి వచ్చింది.
శ్రీలీల ఈ మూవీలో బాలకృష్ణ స్నేహితుడి కూతురుగా కనిపించనుందట. ఇంతకీ బాలకృష్ణ స్నేహితుడెవరనే కదా మీ డౌటు.. స్టార్ యాక్టర్ శరత్‌కుమార్. అంతేకాదు సినిమాలో ఓ ట్విస్ట్ ఉండబోతుండగా.. బాలకృష్ణ, శ్రీలీల మధ్య బాండింగ్ స్టోరీలో చాలా కీలకంగా సాగునుందని ఇన్సైడ్ టాక్. ఇప్పటివరకు రాయలసీయ యాసలో అలరించిన బాలకృష్ణ.. ఈ సారి మాత్రం పక్కా తెలంగాణ యాసలో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలియజేశాడు అనిల్ రావిపూడి.
ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.అఖండ, వీరసింహారెడ్డి చిత్రాల తర్వాత ఎస్ థమన్ మరోసారి అదిరిపోయే బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. తాజా అప్డేట్ ప్రకారం ఎన్బీకే 108 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని సారధి స్టూడియోస్‌లో కొనసాగుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

