Sree Vishnu | అటు సీరియస్.. ఇటు కామెడీ!
శుక్రవారం హీరో శ్రీవిష్ణు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ప్రకటనలను సదరు చిత్రాల మేకర్స్ విడుదల చేశారు. అందులో ఓ సినిమా ‘మృత్యుంజయ్'. ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రెబా జాన్ కథానాయిక.
Sree Vishnu | శుక్రవారం హీరో శ్రీవిష్ణు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ప్రకటనలను సదరు చిత్రాల మేకర్స్ విడుదల చేశారు. అందులో ఓ సినిమా ‘మృత్యుంజయ్’. ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రెబా జాన్ కథానాయిక. హుస్సేన్ షా కిరణ్ దర్శకుడు. సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మాతలు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉంది. శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
ఈ టీజర్లో శ్రీవిష్ణు ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన ఫ్లాష్కట్స్ని చూడొచ్చు. చాలా ఫాస్ట్‌గా సాగిపోయిన ఈ టీజర్లో శ్రీవిష్ణు ఖైదీగా, ఇన్వెస్టిగేటర్‌గా కనిపిస్తున్నారు. విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీత దర్శకుడు. ఇక రెండో సినిమా విషయానికొస్తే.. కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనున్నది.
సుమంత్ నాయుడు జి. నిర్మాత. శ్రీసుబ్రహ్మణేశ్వర సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ‘క్రేజీ రైడ్ కోసం రండి – బ్రేక్‌లు లేవు.. నవ్వులు మాత్రమే’ అనే కోట్ కామెడీ కథాంశంతో సినిమా రూపొందనున్నదని చెబుతున్నది. ఒంగోలు పట్టణం నేపథ్యంలో సినిమా సాగుతుందని పోస్టర్లో హోర్డింగ్ తెలియజేస్తున్నది. సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ తదితరులు ఇతర పాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: రధన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

