చిరంజీవిగారు చెప్పినట్టే జరిగింది
‘రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వించాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్'. లక్కీగా ఈసినిమా దసరాకు రావడం, అందరికీ సెలవులు ఉండటం సినిమాకు బాగా కలిసొచ్చింది.
‘రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వించాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’. లక్కీగా ఈసినిమా దసరాకు రావడం, అందరికీ సెలవులు ఉండటం సినిమాకు బాగా కలిసొచ్చింది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నది. మౌత్ టాక్ పాజిటీవ్‌గా స్ప్రెడ్ అవ్వడంతో వసూళ్లు కూడా పెరుగుతున్నాయి’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. ఆయన కథానాయకుడిగా జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై థియేటర్లలో ప్రదర్శితమవుతున్నది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో శ్రీవిష్ణు మాట్లాడారు.
‘ఈ సినిమా చూసి ఓ పెద్ద హీరో ఫోన్ చేసి, మెచ్చుకున్నారు. నెక్ట్స్ ఈవెంట్స్‌కి ఆయన గెస్ట్‌గా వస్తారు. ఈ సినిమాలో ఆచార్యదళం డైలాగ్‌కు మంచి స్పందన వస్తున్నది. చిరంజీవిగారికి ఈ సీన్ గురించి చెప్పగానే పగలబడి నవ్వారు. థియేటర్లో ఇదే హైలైట్ అవుతుందని ఆయన అన్నారు. ఆయన చెప్పినట్టే జరిగింది. రాధికగారి పాత్రకు అద్భుతమైన స్పందన వస్తున్నది. బాలకృష్ణగారి ఫ్యాన్స్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఇందులో ఓ సీరియస్ టాపిక్ ఉంది. దాన్ని ఫన్‌గా చూపించాం. అదే ఆడియన్‌కి నచ్చింది’ అని శ్రీవిష్ణు చెప్పారు. ఇంకా కోన వెంకట్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

