Sree Vishnu | రొటీన్ సినిమాలకు భిన్నంగా తనకంటూ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ హిట్లు కొట్టే టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు. ఈ హీరో 40వ పుట్టినరోజు నేడు ఈ సందర్భంగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు . శ్రీ విష్ణు ప్రస్తుతం ఓ భీమ్ బుష్ అంటూ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా లైన్లో ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాతగా శ్రీ విష్ణు తన తదుపరి ప్రాజెక్ట్ను చేయబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ను మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఈ సినిమాకు స్వాగ్(SWAG) అనే టైటిల్ను అనౌన్స్ చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ సందర్భంగా టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్ ను రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ తెలిపారు. బోరింగ్ కథలకు టాటా చెబుతూ! సరికొత్త పంథాలో అచ్చ తెలుగు సినిమా #SWAG శ్వాగణిక వంశానికి స్వాగతం అంటూ గ్లింప్స్ ను షేర్ చేశారు. ఈ సినిమా చారిత్రక నేపథ్యం ఉన్న శ్వాగణిక వంశం కథ అని మేకర్స్ అనౌన్స్ చేశారు. కామెడీ బ్యాక్డ్రాప్లో రానున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఇక ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహించబోతున్నాడు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు.