Spark LIFE | ‘శివ’ సినిమా గుర్తొచ్చింది : మంత్రి జగదీష్ రెడ్డి
Spark LIFE | స్వీయ దర్శకత్వంలో విక్రాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్పార్క్ ఎల్.ఐ.ఎఫ్.ఈ’. మోహరీన్, రుక్సర్ థిల్లాన్ కథానాయికలు. ఈ చిత్ర టీజర్‌ను బుధవారం మంత్రి జగదీష్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా టీజర్లో మంచి స్పార్క్ కనిపించింది.
Spark LIFE | స్వీయ దర్శకత్వంలో విక్రాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్పార్క్ ఎల్.ఐ.ఎఫ్.ఈ’. మోహరీన్, రుక్సర్ థిల్లాన్ కథానాయికలు. ఈ చిత్ర టీజర్‌ను బుధవారం మంత్రి జగదీష్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా టీజర్లో మంచి స్పార్క్ కనిపించింది. గత పదిహేనేండ్లుగా తెలుగు సినిమా ట్రెండ్ మారింది. ఈ సినిమా టీజర్ చూడగానే ‘శివ’ సినిమా గుర్తుకొచ్చింది. ఇదొక ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిపోతుందని భావిస్తున్నా’ అన్నారు. విక్రాంత్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కథపై రెండేళ్ల పాటు పనిచేశాను. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. సుహాసిని, నాజర్ వంటి సీనియర్ నటులు ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది. కథానుగుణంగా అద్భుతమైన సాహిత్యం కుదిరింది’ అని పేర్కొన్నారు. ఈ సినిమాలో ప్రతీ ఫ్రేమ్ గొప్పగా ఉందని అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ తెలిపారు. ఈ చిత్రంలో తన పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని కథానాయిక మోహరీన్ చెప్పింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, నవీన్ ఎర్నేని, వివేక్ కూచిబొట్ల తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

