మహేష్ బాబుతో మరోసారి కలిసి నటించాలనుంది : సోఫీ చౌదరి
ముంబై : మల్టీ టాలెంటెడ్ నటి, గాయని, మాజీ వీజే సోఫీ చౌదరి టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు గురించి ఆసక్తికర వివరాలు వెల్లడించింది. మహేష్ అద్భుతమైన వ్యక్తని ఆయనతో మరోసారి నటించాలని ఉందని ఆమె వెల్లడించింది.
ముంబై : మల్టీ టాలెంటెడ్ నటి, గాయని, మాజీ వీజే సోఫీ చౌదరి టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు గురించి ఆసక్తికర వివరాలు వెల్లడించింది. మహేష్ అద్భుతమైన వ్యక్తని ఆయనతో మరోసారి నటించాలని ఉందని ఆమె వెల్లడించింది. 2014లో విడుదలైన వన్ నేనొక్కడినే మూవీలో సోఫీ చౌదరి మహేష్ బాబు సరసన నటించింది.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ఓ సాంగ్‌లో మహేష్‌తో సోఫీ ఆడిపాడింది. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహేష్‌తో పనిచేయడం ఆహ్లాదకరమని ఓ ఇంటర్వ్యూలో సోఫీ చౌదరి తెలిపింది. తాము కలిసి పనిచేసిన రోజులను ఆమె గుర్తుతెచ్చుకున్నారు. మహేష్‌తో కలిసి పనిచేసి పదేండ్లు అవుతున్నా ఇప్పటికీ నిన్నమొన్నలా అనిపిస్తోందని, మహేష్‌తో పనిచేయడం అద్భుతమైన అనుభవమని, మహేష్ సహ నటులను ఎంతో గౌరవిస్తారని సోఫీ పేర్కొంది.
వన్ మూవీ సాంగ్‌ను లండన్‌లో చిత్రీకరించారని, మహేష్‌తో పాట డైరెక్టర్ సుకుమార్ ఎంతో హుందాగా, సౌమ్యంగా వ్యవహరించేవారని తెలిపింది. వారితో కలిసి పనిచేయడాన్ని తాను ఆస్వాదించానని పేర్కొంది. వారితో భవిష్యత్‌లో ఓ పాత్రలో లేకుంటే పాటలో అయినా కలిసి పనిచేయాలని కోరుకుంటున్నానని తెలిపింది.
Read More :
Dhanush – Aishwarya | విడాకుల తర్వాత తొలిసారి భర్త గురించి మాట్లాడిన ఐశ్వర్య రజినీకాంత్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

