బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 66 ఎపిసోడ్స్ పూర్తి కాగా, డిసెంబర్ 20న విజేత ఎవరన్నది తేలనుంది. 19మందితో షో మొదలు కాగా, ఇప్పటి వరకు 9 మంది ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం సరయూ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్, ఐదో వారం హమీదా, ఆరో వారం శ్వేత వర్మ, ఏడో వారం ప్రియ, ఎనిమిదో వారం లోబో, రీసెంట్గా విశ్వ ఎలిమినేట్ అయ్యాడు.
ప్రస్తుతం హౌజ్‌లో 10 మంది ఉండగా, జస్వంత్‌ని రీసెంట్గా సీక్రెట్రూంకి పంపారు.అయితే ఈ పది మందిలో టాప్ 5లో ఎవరు ఉంటారు అనే దానిపై ఇప్పటికే చర్చలు నడుస్తున్నాయి. సెలబ్స్ కూడా పలువురు కంటెస్టెంట్స్‌ని సపోర్ట్ చేస్తూ వారికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించండని కోరుతున్నారు.ఈ క్రమంలో రియల్ హీరో సోనూసూద్ తన సపోర్ట్..శ్రీరామ్ చంద్రకు ఉంటుందని అన్నాడు.
షోలో నీ బెస్ట్ ఇవ్వు శ్రీరామ్. అతడికివే నా ప్రేమాభినందనలు.. లవ్ యూ మ్యాన్ అని సోనూసూద్ చెప్పుకొచ్చాడు. మిగతా కొందరు సెలబ్స్ కూడా శ్రీరామ్‌కి సపోర్ట్ ఇస్తుండడంతో అతనే ఈ సీజన్ విన్నర్ అని అంటున్నారు. మరోవైపు శ్రీరామ్‌పై నెగెటివ్ ప్రచారం కూడా నడుస్తుంది. నాలుగేళ్ల క్రితం శ్రీరెడ్డి.. ‘చూడండి ఇండియన్ ఐడల్ చాట్.. షేమ్ ఆన్ యూ శ్రీరామ్’ అంటూ అతడి గుట్టు రట్టు చేసింది. ఇద్దరూ సన్నిహితంగా దిగిన ఫోటోలను కూడా బయటపెట్టింది. ఈ వ్యవహారం తాజాగా మరోసారి తెరమీదకు వచ్చింది.