బాలీవుడ్ (Bollywood) యాక్టర్ శత్రుఘ్నసిన్హా గారాల కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సోనాక్షిసిన్హా (Sonakshi Sinha). గ్లామరస్ రోల్స్ తో పాటు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ బ్యూటీ డేటింగ్ (Dating ) లో ఉందంటూ అప్పుడపుడు వార్తలు గుప్పుమన్నా..వాటిపై మీడియా ముఖంగా ఎప్పుడూ స్పందించలేదు. కానీ కొన్ని రోజులుగా యాక్టర్ జహీర్ ఇక్బాల్ (Zaheer Iqbal)తో కనిపించిన ఫొటోలు ఇద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ చెప్పకనే చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే సోనాక్షిసిన్హా తాజాగా నెట్టింట్లో పోస్ట్ చేసిన స్టిల్ ఒకటి ఇపుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. అంత స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా..? చేతి వేలికి (engagement ring) ఉంగరం ఉంది. ఫింగర్ రింగ్ హైలెట్ అయ్యేలా క్లోజప్ యాంగిల్లో దిగిన ఫొటోను నెట్టింట పోస్ట్ చేసింది. నాకు పెద్ద రోజు. నా అతిపెద్ద కలలలో ఒకటి ఇపుడు నెరవేరుతోంది. నేను ఆ విషయాన్ని మీతో వెయిట్ చేయలేను. ఇది అంత సులభంగా నమ్మలేకపోతున్నాను క్యాప్షన్ పెట్టింది.
ఫొటో చూసిన నెటిజన్లు ఊరుకుంటారా..? సోనాక్షిసిన్హాకు నిశ్చితార్థం అయిపోయింది. త్వరలోనే పెళ్లిచేసుకోబోతుంది..అంటూ కొందరు కామెంట్ పెట్టారు. మరొకరేమో సోనాక్షి సిన్హా జువెలరీ వ్యాపారాన్ని మొదలుపెట్టేందుకు రెడీ అయింది. అందుకే ఇలా రింగ్‌తో హైప్ క్రియేట్ చేస్తోందని కామెంట్ పెట్టారు. మొత్తానికి కారణమేదైనా సోనాక్షి సిన్హా ఇలా స్టిల్ పోస్ట్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.