Godfather | చిరంజీవి ‘గాడ్ ఫాదర్’..తెరపైకి చాలా ప్రశ్నలు..!
టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మొన్న ఆగస్టు 22న జన్మదినం సందర్భంగా ఏకంగా నాలుగు సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ విడుదలయ్యాయి.

టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొన్న ఆగస్టు 22.. 66వ జన్మదినం సందర్భంగా ఏకంగా నాలుగు సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ విడుదలయ్యాయి. వాటి షూటింగ్స్ వివరాలు కూడా చెప్పేశాడు మెగాస్టార్. ఏ సినిమాను ఎప్పుడు మొదలు పెట్టి ఎప్పుడు పూర్తి చేయబోతున్నాడు అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తయింది. చిన్నచిన్న ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది.
మరోవైపు ఈ సినిమా తర్వాత గాడ్ ఫాదర్ (Godfather) మొదలు పెట్టనున్నాడు చిరంజీవి. మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన లూసిఫర్ సినిమాకు ఇది రీమేక్. మోహన్ రాజా తెలుగులో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్లు లూసిఫర్ కథలో చాలా మార్పులు చేశాడు రాజా. దీనికోసం దాదాపు ఆరు నెలలకు పైగా నేను స్క్రిప్ట్ వర్క్ చేశాడు ఈ దర్శకుడు. మోహన్ రాజా (Mohan Raja) కంటే ముందు వినాయక్, సుజిత్ ఇలాంటి దర్శకులు లూసిఫర్ కోసం వర్క్ చేశారు. కానీ అది చిరంజీవికి నచ్చలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ నేడో రేపో మొదలు కానుంది. అయినా కూడా చాలా ప్రశ్నలు అభిమానులను అలాగే వేధిస్తున్నాయి. వీటిపై క్లారిటీ ఇవ్వకుండానే లొకేషన్ కి వెళుతున్నాడు దర్శకుడు రాజా.
లూసిఫర్ లో రెండు కీలక పాత్రలు ఉంటాయి. వాటిని అక్కడ పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్ పోషించారు. ఇక్కడ ఈ పాత్రలను ఎవరు చేయబోతున్నారు అనేది సస్పెన్స్. చిరంజీవి చెల్లెలి పాత్ర కోసం చాలామంది హీరోయిన్లను అడిగారు. త్రిష, నయనతార, విజయశాంతి లాంటి వాళ్ళు ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదు. మరి ఇందులో ఎవరు నటించబోతున్నారు అనేది ఇప్పటి వరకు తెలియదు. దీనిపై క్లారిటీ ఇవ్వకుండానే షూటింగుకు వెళ్తున్నాడు మోహన్ రాజా. మరోవైపు పృథ్వీరాజ్ పోషించిన క్యారెక్టర్ లో ఎవరు నటించబోతున్నారు అనేది కూడా తెలియదు.
టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ (Satyadev) ఈ పాత్రలో నటించబోతున్నాడని కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. కానీ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ లో కీలక పాత్రలో నటించబోతున్నాడు అంటూ కొత్త వార్తలు మొదలయ్యాయి. ఈ రెండు పాత్రలతో పాటు మరికొన్ని కీలక అంశాలు కూడా దాచిపెట్టి షూటింగ్ కు సిద్ధం చేసుకుంటున్నాడు దర్శకుడు మోహన్ రాజా. ఈ సినిమాని కేవలం మూడు నెలల్లో పూర్తి చేయాలని చిరంజీవి కండిషన్ పెట్టాడు. అక్టోబర్, నవంబర్ నాటికి గాడ్ ఫాదర్ షూటింగ్ పూర్తి కానుంది. సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుందని తెలుస్తోంది. మరి ఈ సస్పెన్స్ కు ఎప్పుడు తెర దించుతారో చూడాలి.
ఇవికూడా చదవండి..
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

