సారంగపాణి ఆ లోటు తీర్చాడు
‘ఫుల్ లెన్త్ కామెడీ జోనర్ మినహా అన్ని తరహా సినిమాలూ నిర్మించా. జంధ్యాల జీవించి ఉన్న రోజుల్లో ఆయన కనిపించినప్పుడల్లా అడిగేవాడ్ని ‘ఓ సినిమా చేసి పెట్టండి సార్..’ అని. ‘చేద్దాంలే ప్రసాద్..’ అంటూ ఉండేవారాయన. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన వెళ్లిపోయారు.
‘ఫుల్ లెన్త్ కామెడీ జోనర్ మినహా అన్ని తరహా సినిమాలూ నిర్మించా. జంధ్యాల జీవించి ఉన్న రోజుల్లో ఆయన కనిపించినప్పుడల్లా అడిగేవాడ్ని ‘ఓ సినిమా చేసి పెట్టండి సార్..’ అని. ‘చేద్దాంలే ప్రసాద్..’ అంటూ ఉండేవారాయన. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన వెళ్లిపోయారు. దాంతో ఆ లోటు అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ‘సారంగపాణి జాతకం’ సినిమాతో ఆ లోటును దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ భర్తీ చేశాడు. రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునే కామెడీ థ్రిల్లర్ ఇది. నిర్మాతగా నా కెరీర్లో గుర్తుండిపోయే మరో సినిమాగా ‘సారంగపాణి జాతకం’ నిలుస్తుంది’ అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు.
ప్రియదర్శి, రూపా కొడువయూర్ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ విలేకరులతో ముచ్చటించారు. ‘ఇంద్రగంటి ‘జెంటిల్‌మేన్’తో నిర్మాతగా నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ‘సమ్మోహనం’తో మా సంస్థకు ఇంద్రగంటి మరో విజయాన్నిచ్చారు. రేపు రానున్న ‘సారంగపాణి జాతకం’తో మా కాంబినేషన్లో హ్యాట్రిక్ రాబోతుంది. ఈ సినిమా కథ, కథనం అందర్నీ మెప్పిస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది. సరైన రిలీజ్ కోసమే కాస్తంత టైమ్ తీసుకున్నాం.
సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. ఇదే మంచి సీజన్ అనుకొని ఏప్రిల్ 25న వస్తున్నాం.’ అని తెలిపారు శివలెంక కృష్ణప్రసాద్. ఈ సినిమా చూసిన శ్రేయోభిలాషులంతా బావుందని మెచ్చుకున్నారని, ద్వితీయార్ధం నెక్ట్స్ లెవల్లో ఉంటుందని, ఆద్యంతం ఆసక్తికరంగా సినిమా సాగుతుందని, ప్రియదర్శి, నరేశ్, వెన్నెలకిశోర్, అవసరాల శ్రీనివాస్, వైవాహర్షల కామెడీ హైలైట్‌గా నిలుస్తుందని, ‘కోర్ట్’లో సీరియస్ మోడ్‌లో కనిపించిన ప్రియదర్శి.. ఈ సినిమాలో పూర్తిభిన్నంగా కనిపించి అందర్నీ నవ్విస్తారని శివలెంక కృష్ణప్రసాద్ చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ala venkateshwar reddy | పెద్దవాగు వెంట రైతులతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర.. వివరాలివే
minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
Human Egg | మానవ అండాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. ఈడీ దాడుల్లో భారీగా నగదు, ఆస్తులు సీజ్
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

